Radha Iyengar Plumb : పెంటగాన్ పోస్ట్ కి రాధా అయ్యంగార్
ప్రకటించిన అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్
Radha Iyengar Plumb : మరో ప్రవాస భారతీయురాలికి కీలక పదవి దక్కింది. పెంటగాన్ టాప్ పోస్ట్ కు ఎంపిక చేశారు అమెరికా దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. ఇండియన్ , అమెరికన్ సెక్యూరిటీలో ఆమెకు అనుభవం ఉంది.
ఇక రాధా అయ్యంగార్ ప్లంబ్ గూగుల్ కంపెనీలో ట్రస్ట్ అండ్ సేఫ్ట కోసం రీసెర్చ్ అండ్ ఇన్ సైట్స్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సంస్థలో బిజినెస్ అనలిటిక్స్ , డేటా సైన్స్ , టెక్నికల్ రీసెర్చ్ లో క్రాస్ ఫంక్షనల్ టీమ్ లకు నాయకత్వం వహించారు.
సెక్యూరిటీ విషయంలో కీలకమైన పోస్ట్ కు ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాధా అయ్యంగార్ ప్లంబ్(Radha Iyengar Plumb) ను పెంటగాన్ లో అక్విజిషన్ అండ్ సస్టైన్ మెంట్ కోసం డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పదవికి నామినేట్ చేశారు.
ఇప్పటికే 75 శాతానికి పైగా భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. ఆమెను నామినేట్ చేస్తూ ప్రెసిడెంట్ జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాధా అయ్యంగార్ ప్లంబ్ గతంలో గూగుల్ సంస్థలో పని చేసే కంటే ముందు ఫేస్ బుక్ లో విధాన విశ్లేషణకు సంబంధించిన గ్లోబల్ హెడ్ గా పని చేశారు. అధిక ప్రమాద, అధిక హాని భద్రత, క్లిష్టమైన అంతర్జాతీయ భద్రతా సమస్యలపై ఫోకస్ పెట్టారు ఆమె.
రాధా అయ్యంగార్ ప్లంబ్(Radha Iyengar Plumb) రాండ్ కార్పొరేషన్ లో సనియర్ ఆర్థిక వేత్త కూడా. అక్కడ ఆమె రక్షణ శాఖ అంతటా సంసిద్దత,
భద్రతా ప్రయత్నాల కొలత, మూల్యాంకనాన్ని మెరుగు పర్చడంపై ఫోకస్ పెట్టారు.
రాధా అయ్యంగార్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ , డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ , వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో జాతీయ భద్రతా సమస్యలపై సీనియర్ పదవులు నిర్వహించారు.
Also Read : హెచ్-1బి వీసా జారీలో మార్పులు అవసరం