Agnipath Protests : ‘అగ్నిప‌థ్’ అగ్నిగుండం ఆగ‌ని విధ్వంసం

బీహార్ లో వాహ‌నాల‌కు నిప్పు..యూపీలో అరెస్ట్

Agnipath Protests : అగ్నిప‌థ్ స్కీం(Agnipath Protests) అగ్గిని రాజేసింది. దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఆందోళ‌న‌లతో అట్టుడుకుతోంది దేశం. బీహార్ లో నిర‌స‌న‌కారులు పేట్రేగి పోయారు. ప‌లు వాహ‌నాల‌కు నిప్ప‌టించారు.

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 260 మంది ఆందోళ‌న‌కారుల‌ను అరెస్ట్ చేశారు. నిర‌స‌న‌ల దెబ్బ‌కు 340 రైళ్లు ఆయా రైల్వే స్టేష‌న్ల‌లో నిలిచి పోయాయి. ప‌రిస్థితి అదుపులోకి రాక పోవ‌డంతో 244 రైళ్ల‌ను ర‌ద్దు చేసింది రైల్వే శాఖ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా.

అగ్నిప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీంను(Agnipath Protests) ర‌ద్దు చేయాల‌ని కోరుతూ శ‌నివారం బీహార్ బంద్ కు పిలుపునిచ్చారు. బీహార్ తో మొద‌లైన అగ్నిప‌థ్ నిర‌స‌న ఇప్పుడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాల‌కు పాకింది.

దేశానికి ఇది పెద్ద సమ‌స్య‌గా మారింది. తెలంగాణ‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో అగ్నిప‌థ్ పై పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిర‌స‌న ప్ర‌క‌టించారు. ప‌లు రైళ్ల‌కు నిప్పంటించారు.

పోలీస్ కాల్పుల్లో ఒక‌రు మ‌ర‌ణించారు. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన రాకేశ్ అనే నిరుద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ సీఎం రూ. 25 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా రాకేశ్ మృతికి కేంద్రానిదే బాధ్య‌త అని ఆరోపించారు కేసీఆర్. ఇక బీహార్ లో ప‌రిస్థితి విష‌మించింది. రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునివ్వ‌డంతో పోలీసుల‌ను భారీగా మోహ‌రించారు.

దీంతో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపి వేశారు. ఈ ప‌థ‌కం ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్తం కావ‌డంతో కేంద్రం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. కేంద్ర సాయుధ పోలీసు ద‌ళాల్లో రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించింది.

Also Read : ‘అగ్నిప‌థ్ వీరుల‌’కు 10 శాతం రిజ‌ర్వేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!