Blasts Gurudwara Kabul : కాబూల్ లో పేలుళ్లు..భార‌త్ దిగ్భ్రాంతి

గురు ద్వారా స‌మీపంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌

Blasts Gurudwara Kabul : నిన్న‌టి దాకా ప్ర‌శాంతంగా ఉన్న ఆఫ్గ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్(Blasts Gurudwara Kabul)  లో శ‌నివారం ఉద‌యం భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. భార‌త దేశం ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

కార్తే ప‌ర్వాన్ ప్రాంతంలోని గురు ద్వారా స‌మీపంలో ర‌ద్దీగా ఉండే ర‌హ‌దారిపై పేలుళ్లు సంభ‌వించాయి. ఈ ప్రాంతం ఎల్ల‌ప్పుడూ ర‌ద్దీగా,, జ‌నంతో నిండి ఉంటుంది.

చాలా మంది మ‌ర‌ణించిన‌ట్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో రెండు పేలుళ్లు జ‌రిగాయి. ఈ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శ‌బ్దాలు కూడా వినిపించిన‌ట్లు స‌మాచారం.

గురుద్వారాలో క‌నీసం 16 మంది భ‌క్తులు ఉన్నార‌ని, కాగా మ‌ర‌ణించిన వారి సంఖ్య తెలియ రాలేదు. ఇంకా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు త‌మ‌కు అంద‌లేద‌ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

వివ‌రాల కోసం వేచి చూస్తున్నామ‌ని తెలిపింది. ఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిన వెంట‌నే భ‌ద్ర‌తా సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు. ఈ పేలుళ్లు, కాల్పుల ఘ‌ట‌న కంటే ముందు గ‌త మే 25న ఆఫ్గ‌నిస్తాన్ లోని బాల్ఖ్ ప్రావిన్స్ రాజ‌ధానిలో మూడు పేలుళ్లు సంభ‌వించాయి.

కనీసం 9 మంది మ‌ర‌ణించారు. 15 మంది గాయ‌ప‌డ్డారు. అదే రోజు కాబూల్(Blasts Gurudwara Kabul)  న‌గ‌రంలోని మ‌సీద్ ష‌రీఫ్ హ‌జ్ర‌త్ జ‌కారియా మ‌సీదులో పేలుడు సంభ‌వించింది. ఇద్ద‌రు మ‌ర‌ణించారు.

ఇదిలా ఉండ‌గా యుఎస్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి రినా అమిరి స్పందించారు. తాలిబ‌న్లు ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు హామీ ఇవ్వాల‌ని కోరారు.
2104 నుండి ఆఫ్గ‌నిస్తాన్ లో ఐఎస్ఐఎస్ ఖొరాస‌న్ శాఖ నుండి తాలిబ‌న్లు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు.

Also Read : పాక్ ఉగ్ర‌వాదుల లిస్టు వెల్ల‌డికి చైనా చెక్

Leave A Reply

Your Email Id will not be published!