Rakesh Tikait : అగ్నిపథ్ పథకం బూటకం – తికాయత్
జూన్ 30న దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమం
Rakesh Tikait : భారతీయ కిసాన్ మార్చా జాతీయ అధికార ప్రతినిధి, కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ తికాయత్(Rakesh Tikait) సంచలన కామెంట్స్ చేశారు. శనివారం భారీ ప్రదర్శన చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు.
రాకేశ్ తికాయత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ పథకం పూర్తిగా బూటకమని ఆరోపించారు రాకేశ్ తికాయత్.
యువతకు ఉపాధి పేరుతో ఆడుతున్న నాటకంగా ఆయన పేర్కొన్నారు. ఇది యువతకు ఉపాధి కల్పించాలనేది కాకుండా వారి మనో ధైర్యాన్ని దెబ్బ తీసేలా ఉందని మండిపడ్డారు.
దేశంలో 70 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, కానీ ఈరోజు వరకు ఈ పోస్టుల భర్తీపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. దేశంలో పవర్ లోకి ఎనిమిది ఏళ్లవుతోంది.
కానీ బ్లాక్ మనీ అన్నారు. దొంగలు విదేశాల్లోనే దాక్కున్నారు. ఇప్పటి వరకు తీసుకు రాలేక పోయారు. అంబానీ, అదానీ, అమెజాన్ లకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు ఉంటున్నాయని రాకేశ్ తికాయత్(Rakesh Tikait) ఆరోపించారు.
ప్రతిపక్షాలు, సాయుధ దళాలకు చెందిన వారితో చర్చలు జరపకుండా అగ్నిపథ్ స్కీం తీసుకు రావడం వల్ల యువకులు రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మరింత పెరిగాయని ఇప్పటికైనా అగ్నిపథ్ పథకాన్ని విరమించు కోవాలని డిమాండ్ చేశారు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదానికి తూట్లు పొడవడం తప్ప చేసిందేమీ లేదని మండి పడ్డారు రాకేశ్ తికాయత్.
Also Read : అద్భుత పథకం అగ్నిపథ్ స్కీం
मोदी सरकार की अग्निपथ योजना युवाओं के लिए रोजगार के नाम पर सिर्फ छलावा है। यह उनको रोजगार देने की नहीं उनका मनोबल तोड़ने की साजिश जैसा है।@ANI @PMOIndia @PTI_News @ndtv @PMishra_Journo pic.twitter.com/KpajmBdTdC
— Rakesh Tikait (@RakeshTikaitBKU) June 18, 2022