Khurram Dastagir : 15 ఏళ్లు పాలించాలని ఇమ్రాన్ ఖాన్ కుట్ర
మాజీ ప్రధానిది నియంతృత్వ ధోరణి
Khurram Dastagir : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, మాజీ క్రికెట్ జట్టు స్కిప్పర్ అయిన ఇమ్రాన్ ఖాన్ పై సంచలన కామెంట్స్ చేశాడు దేశ విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిర్(Khurram Dastagir).
ఆయన పూర్తిగా నియంతృత్వ ధోరణితో ఆలోచించాడని, కనీసం 15 ఏళ్ల పాటు దేశాన్ని పాలించాలని ప్లాన్ చేశాడని ఆరోపించారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ లో మిలటరీ సాయంతో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్ర పన్నాడని మండిపడ్డారు.
ముందస్తు సమాచారం తమకు అందిందని పేర్కొన్నారు దస్తగిర్. కానీ తను ఊహించ లేక పోయాడు. తానే అవిశ్వాస ఓటింగ్ లో ఓడి పోతాడని. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమపై ఆధిపత్యం చెలాయించాలని చూశాడని ఆరోపించారు
. ప్రతిపక్ష నాయకత్వాన్ని క్లీన్ స్వీప్ చేయాలని ఇమ్రాన్ ఖాన్ కుట్ర పన్నాడంటూ మండిపడ్డారు. తన పాలనను ఈ సందర్భంగా ఎవరూ లేకుండా తానొక్కడే పాలించాలని ప్లాన్ చేశాడని, ఇది తమకు తెలిసే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సి వచ్చిందని ఖుర్రం దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఓ న్యూస్ చానల్ లో విద్యుత్ శాఖ మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఆయన చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు పాకిస్తాన్ లో కలకలం రేపాయి.
ప్రస్తుత ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ , అహ్సాన్ ఇక్బాల్ సహా మొత్తం ప్రతిపక్ష నాయకత్వాన్ని బలహీన పర్చడమే కాకుండా పూర్తిగా నామ రూపాలు లేకుండా చేయాలని పక్కా స్కెచ్ చేశాడంటూ ఇమ్రాన్ పై మండిపడ్డారు.
Also Read : ప్రవక్తపై కామెంట్స్ చేసినందుకే దాడి చేశాం