Agnipath Traffic jam : అగ్నిపథ్ ప్రభావం ట్రాఫిక్ జామ్
ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్ ప్రెస్ వే వద్ద భారీగా నిలిచిన వాహనాలు
Agnipath Traffic jam : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు. దేశంలోని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేసింది కేంద్రం. అగ్నిపథ్ నిరసనలపై తనిఖీలు ముమ్మరం చేశారు.
దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ ఎత్తున వాహనాలు నిలిచి పోయాయి. ఢిల్లీ – గురు గ్రామ్ ఎక్స్ ప్రెస్ వే వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కొన్ని సంస్థలు, పార్టీలు ఆందోళన చేపట్టాయి.
ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని సంస్థలు డిమాండ్ చేశాయి. ఇదిలా ఉండగా సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్ని పథ్ పథకానికి(Agnipath Traffic jam) వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తో పాటు ఆప్ , ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి.
అగ్నిపథ్ స్కీంను రద్దు చేయాలని పట్టుబట్టాయి. దీంతో ముందు జాగ్రత్తగా పంజాబ్, హర్యానా , తదితర ప్రాంతాలలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇక ఫరీదాబాద్ , నోయిడాలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నారు.
మరో వైపు అగ్నిపథ్(Agnipath Traffic jam) పేరుతో తమ వాహనాలను చెక్ చేయడం ఏమిటి అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. సాధారణ పనుల కోసం వెళ్లే తమను ఇలా ఆపి ఉంచడం మంచి పద్దతి కాదంటున్నారు.
Also Read : బీహార్ సీఎం మౌనం బీజేపీ ఆగ్రహం