PM Modi : యోగా సాధనం ప్ర‌పంచ శాంతికి మార్గం – మోదీ

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా పిలుపు

PM Modi : యోగా ప్ర‌పంచానికి భార‌త దేశం అందించిన గొప్ప‌, అపురూప‌మైన సాధ‌నం యోగా. అది ఒక సాధనం మాత్ర‌మే కాదు విశ్వ శాంతికి మార్గమ‌ని స్ప‌ష్టం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) .

జూన్ 21న మంగ‌ళ‌వారం అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు ప్ర‌పంచ వ్యాప్తంగా. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి రెండు రోజుల టూర్ లో భాగంగా క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా దేశంలోనే పేరొందిన మైసూర్ రాజా ప్యాలెస్ లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi)  యోగాస‌నాలు వేశారు. అనంత‌రం వేలాది మంది హాజ‌రైన వారిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

జీవితంలో సుఖం పొందాలంటే, సంతోషంగా ఉండాలంటే, మానసిక‌, శారీర‌క స‌మ‌తుల్య‌త పాటించాలంటే యోగాతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు మోదీ.

భార‌త దేశం యోగాను ప‌రిచ‌య‌డం వల్ల ఇవాళ కోట్లాది మంది దానిని ప్రాక్టీస్ చేస్తూ అద్భుత‌మైన ఫ‌లితాలు పొందుతున్నార‌ని చెప్పారు. 15 వేల మందికి పైగా పాల్గొన‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

తాను ఇవాళ ఈ స్థాయిలో ప‌ని చేస్తున్నానంటే కార‌ణం యోగాను అనుస‌రించ‌డం, ప్రాక్టీస్ చేయ‌డం, దానినే శ్వాస‌గా మార్చు కోవ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి.

మైసూర్ నాకు ఇష్ట‌మైన ప్రాంతం. ఇక్క‌డ ఆధ్యాత్మికత వెల్లి విరుస్తోంద‌న్నారు. ఒక‌ప్పుడు యోగాను ప‌ట్టించుకునే వారు కాద‌ని కానీ ఇప్పుడు ప్ర‌పంచం యోగా జ‌పం చేస్తోంద‌ని చెప్పారు మోదీ.

వేదాలు, ఉప‌నిష‌త్తుల్లో యోగా ప్ర‌స్తావ‌న ఉంద‌న్నారు. ఈసారి యోగా ఫ‌ర్ హ్యూమానిటీ థీమ్ తో వేడుక‌లు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు ప్ర‌ధాన మంత్రి.

Also Read : యోగా జీవితంలో ఓ భాగం కావాలి – సోనోవాల్

Leave A Reply

Your Email Id will not be published!