Maharastra MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా
10 స్థానాల్లో 5 శివసేన కూటమి..5 కాషాయ పార్టీకి
Maharastra MLC Election : మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో(Maharastra MLC Election) బీజేపీ కోలుకోలేని షాక్ ఇచ్చింది శివసేన సంకీర్ణ పార్టీ కూటమి మహా వికాస్ అఘాడికి. తాజాగా శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది.
మొత్తం 10 స్థానాలకు గాను 5 స్థానాలలో జయకేతనం ఎగుర వేసింది. ఒక రకంగా రెడ్ బెల్స్ మోగించింది బీజేపీ. దీంతో కాషాయ పార్టీలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. శివసేసన కూటమి 5 సీట్లు చేజిక్కించుకుంది.
మొత్తం 10 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎంవిఏ మిత్రపక్షాలు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు
ఒక్కొక్క పార్టీ ఇద్దరు చొప్పున అభ్యర్థులను బరిలో దింపాయి.
బీజేపీ ఐదుగురు క్యాండిడేట్స్ ను ప్రతిపాదించింది. మరోసారి శివసేనకు షాక్ తగిలింది. ప్రభుత్వ పక్షాన ఉన్నారని భావిస్తున్న ఎమ్మెల్యేలు క్రాస్
ఓటింగ్ కు పాల్పడ్డారు.
దీంతో బీజేపీకి సీట్లు రావడం విస్తు పోయేలా చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో(Maharastra MLC Election) శివసేన ఓటమి పాలైన తర్వాత రాష్ట్రంలోని అధికార మహా వికాస్ అఘాడీకి 10వ సీటు కోసం పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది.
శివసేన పార్టీ అభ్యర్థులు సచిన్ అహిర్, అంశ్య పద్వీ గెలుపొందారు. ఇక శరద్ పవార్ నేత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్నాథ్ ఖడ్సే ,
రాం రాజే నింబాల్కర్ విజయం సాధించారు.
ఇక భారతీయ జనతా పార్టీ కి చెందిన శ్రీకాంత్ భారతి, ప్రవీణ్ దారేకర్ , ఉమా ఖప్రే, రామ్ షిండే సత్తా చాటారు. ఇక బీజేపీకి చెందిన
ప్రసాద్ లాడ్ క్రాస్ ఓటింగ్ కారణంగా ఐదో సీటును చేజిక్కించు కోగలిగారు.
ఈ గెలుపు తంత్రం అంతా బీజేపీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దేనని కితాబు ఇచ్చారు. సీఎం ఎవరినీ కలవడు. ఎంవిఏ ఏ పనీ చేయదు.
వాళ్లకు ఎవరికీ టైం లేదని ఆరోపించారు.
Also Read : రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను – గాంధీ