Eknath Shinde : బాలా థాక్రే ప్రియ‌ శిష్యుడిని – ఏక్ నాథ్ షిండే

శివ‌సేన‌కు గుడ్ బై బీజేపీలో చేరే చాన్స్

Eknath Shinde : శివ‌సేన కూట‌మిలో కీల‌క నేత‌గా ఉన్న రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde)  షాకింగ్ కామెంట్స్ చేశారు మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తాను శివ‌సేన స్థాప‌కుడు , మ‌రాఠా యోధుడు బాల్ థాక్రే ప్రియ శిష్యుడిన‌ని పేర్కొన్నారు. అయితే అధికారం కోసం తాను ఎట్టి ప‌రిస్థితుల్లో ద్రోహం చేసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

తాను పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని ఖండించారు. ఇదే స‌మ‌యంలో రాజకీయంగా తీవ్ర దుమారం, ఉత్కంఠ కొన‌సాగుతుండ‌గా ఏక్ నాథ్ షిండే మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ ద్వారా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

తాము బాలా సాహెబ్ కు నిబ‌ద్ద‌త క‌లిగిన సైనికులం. ఆయ‌న మమ్మ‌ల్ని యోధులుగా త‌యారు చేశారు. హిందూత్వ పాఠాలు బోధించారు. అధికారం కోసం ఎప్పుడూ పాకులాడ లేద‌ని పేర్కొన్నారు.

కష్ట‌ప‌డి ప‌ని చేసుకుంటూ పోవ‌డ‌మే త‌ప్పా ఏనాడు ప‌ద‌వి కావాల‌ని అడ‌గ‌లేద‌ని తెలిపారు. బాలా సాహెబ్ ఆలోచ‌న‌ల్ని, ధ‌ర్మ‌వీర్ ఆనంద్ దిఘే సాహబ్ ఆచ‌ర‌ణాత్మ‌క పాఠ‌శాల‌ను ప్రాణం ఉన్నంత దాకా మ‌రిచి పోమ‌ని స్ప‌ష్టం చేశారు ఏక్ నాథ్ షిండే.

ఇదిలా ఉండ‌గా ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో పాటు పార్టీ ఎమ్మెల్యే ప‌ద‌వి కి కూడా రాజీనామా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా ఆయ‌న గ‌త కొంత కాలం నుంచి శివ‌సేన పార్టీ అధినాయ‌క‌త్వంపై, సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, ఆయ‌న త‌న‌యుడు ఆధిప‌త్యాన్ని స‌హించ లేక పోతున్న‌ట్లు వినికిడి. అందుకే చెప్పా పెట్ట‌కుండా ఎమ్మెల్యేల‌తో సూర‌త్ కు చెక్కేశారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).

Also Read : బీజేపీ కుట్ర‌లు ఫ‌లించ‌వు – సంజ‌య్ రౌత్

Leave A Reply

Your Email Id will not be published!