Punjab CM : అవినీతిపై ఉక్కుపాదం ఫ‌లిస్తున్న ప్ర‌య‌త్నం

సీఎం భ‌గ‌వంత్ మాన్ కు ప్ర‌జ‌లు జేజేలు

Punjab CM : దేశంలోనే పంజాబ్ రాష్ట్రాన్ని అవినీతి ర‌హిత రాష్ట్రంగా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు సీఎం గా కొలువు తీరిన భ‌గ‌వ‌వంత్ మాన్(Punjab CM). గ‌తంలో ముఖ్య‌మంత్రులు రాజ్ భ‌వ‌న్ వేదిక‌గా ప్ర‌మాణ స్వీకారం చేస్తే మాన్ మాత్రం తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ప్ర‌మాణం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

అంతేనా దేశం కోసం ఉరికొయ్య‌ల‌ను ముద్దాడిన భ‌గ‌త్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల‌కు నివాళిగా కొంగ‌ర్ క‌లాన్ లో ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు.

ఇది పంజాబ్ చ‌రిత్ర‌లో ఓ సువ‌ర్ణ అధ్యాయం. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు ప‌ద్ద‌తిన ప‌ని చేస్తున్న వారంద‌రినీ ప‌ర్మినెంట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వారికి పోస్టింగ్ ఆర్డ‌ర్స్ కూడా ఇచ్చారు. 31 వేల పోస్టుల భ‌ర్తీకి ఆదేశాలు ఇచ్చారు. ఆపై తాను అవినీతి, అక్ర‌మాల‌ను స‌హించ బోనంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అంతేనా ఏకంగా క‌ర‌ప్ష‌న్ ఫ్రీ కోసం టోల్ ఫ్రీ నెంబ‌ర్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డి నుంచైనా స‌రే ఎవ‌రైనా లంచం డిమాండ్ చేసినా లేదా అక్ర‌మాల‌కు పాల్ప‌డినా వెంట‌నే మెస్సేజ్ చేయండి.

లేదా ఫోటోలు, వీడియోలు త‌న వాట్సాప్ నంబ‌ర్ కు పంపించ‌మ‌ని కోరారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ త‌న ఫోన్ నెంబ‌ర్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో త‌న కేబినెట్ లో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ విష‌యంపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఆపై మంత్రికి తెలియ‌కుండానే ఆధారాల‌న్నీ తెప్పించుకున్నారు. అవి నిజ‌మ‌ని తేల‌డంతో వెంట‌నే కేబినెట్ నుంచి స‌స్పెండ్ చేశారు.

భార‌త దేశ చ‌రిత్ర‌లో 2015 లో ఆప్ సీఎం కేజ్రీవాల్ ఇలాగే మంత్రిని తొల‌గించారు. 2022లో అదే ఆప్ కు చెందిన భ‌గ‌వంత్ మాన్(Punjab CM) ఈ సాహసోపేత‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అవినీతి కేసుల్లో 45 మంది ప్ర‌భుత్వ అధికారులు, ఇత‌రుల‌ను అరెస్ట్ చేశారు. 28 ఎఫ్ఐఆర్ లు న‌మోదు చేశారు.

Also Read : డ్ర‌గ్ రెగ్యూలేట‌ర్ ఆఫీస‌ర్ ఈశ్వ‌ర్ రెడ్డి అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!