Kothapalli Jayashankar : జయశంకర్ సారుకు నివాళి
ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ వాసుల జ్ఞాపకం
Kothapalli Jayashankar : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధాన కారకుడు. మార్గ నిర్దేశకుడు. జాతిపితగా ఎన్నటికీ గుర్తుంచు కోగదగిన మహోన్నత మానవుడు కొత్తపల్లి జయశంకర్(Kothapalli Jayashankar) . విస్తృతమైన అవగాహన కలిగిన ఏకైక మేధావి. వ
రంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ఆగస్టు 6, 1934లో పుట్టారు. ప్రొఫెసర్ గా, తెలంగాణ సిద్దాంతకర్తగా, పితామహుడిగా నిలిచి పోయారు. జూన్ 21, 2011లో ఇక సెలవంటూ వెళ్లి పోయారు.
తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉన్న అరుదైన అధ్యాపకుడు. తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. చివరి దాకా ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా నే ఉన్నారు.
ఆర్థిక శాస్త్రంలో పీహెచ్ డీ చేశారు. ప్రిన్సిపాల్ గా, రిజిస్ట్రార్ గా , కాకతీయ యూనివర్శిటీ వీసీగా పని చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో , సాంబర్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కేసీఆర్ కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో తెలియ చేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కళ్లారా చూడాలని పరితపించిన జయశంకర్ దానిని చూడకుండానే కన్ను మూశారు. ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆయన బతికే ఉంటారు.
మనల్ని పలకరిస్తూనే ఉంటారు. తెలంగాణ అంటేనే జయశంకర్(Kothapalli Jayashankar) . జయశంకర్ సారు అంటేనే తెలంగాణ. మేధావులు, కళాకారులు, రచయితలు, అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు జయశంకర్ సారుకు నివాళులు అర్పించారు.
Also Read : విద్యార్థుల పోరాటం దిగొచ్చిన ప్రభుత్వం