Draupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ బిడ్డ ‘ముర్ము’
బీజేపీ సంచలనం ఒడిశా గిరిజన నేతకు గౌరవం
Draupadi Murmu : భారతీయ జనతా పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును(Draupadi Murmu) నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలిగా ఉన్నారు.
ద్రౌపది ముర్ముకు 64 ఏళ్లు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక భేటీ అనంతరం నేషనల్ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. ఇదిలా ఉండగా విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత, టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హాను డిక్లేర్ చేసింది.
జూలై నెల 18న రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. అందరి కళ్లు ఈ ఎన్నికపైనే ఫోకస్ ఉంది. అటు ఎన్డీయేకు ఇటు విపక్షాల అభ్యర్థి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది.
భారత దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి. తొలి ఒడిశావాసిగా , మొట్ట మొదటి గిరిజన మహిళగా ముర్ము చరిత్ర సృష్టిస్తారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి 49 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి.
ఆదివాసీ బిడ్డకు అరుదైన అవకాశం ఇవ్వడంతో ఎన్డీయేతర భాగస్వామ్య పక్షాలు సైతం ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu ) మద్దతు తెలిపే అవకాశాలు లేక పోలేదు.
ఒడిశా లోని బిజూ జనతాదళ్ , జార్ఖండ్ లోని పాలక గిరిజన పార్టీ జేఎంఎం, ఇతక ప్రాంతీయ పార్టీలు ఈ లిస్టులో ఉన్నాయి. ద్రౌపది ముర్ము గతంలో గవర్నర్ గా పని చేశారు.
స్వాతంత్రం వచ్చాక జన్మించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు సృష్టించనున్నారు. భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా గిరిజన బిడ్డకు అవకాశం ఇవ్వడం దేశ రాజకీయాలలో చర్చకు దారితీసింది.
Also Read : అవినీతిపై ఉక్కుపాదం ఫలిస్తున్న ప్రయత్నం