Nitin Deshmukh : మమ్మల్ని కిడ్నాప్ చేశారు – ఎమ్మెల్యే
నితిన్ దేశ్ ముఖ్ సంచలన కామెంట్స్
Nitin Deshmukh : మహారాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి ఏక్ నాథ్ ముండే సారథ్యంలో 46 మంది ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ కు వెళ్లారు.
అక్కడి నుంచి అస్సాంలోని గౌహతికి తమ మకాం మార్చారు. ఈ తరుణంలో ఆ ఎమ్మెల్యేలలో ఒకరైన నితిన్ దేశ్ ముఖ్(Nitin Deshmukh) షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను ఎలా కిడ్నాప్ చేశారనే దానిపై వివరణ ఇచ్చాడు.
బుధవారం షిండే తిరుగుబాటు శిబిరం నుంచి గౌహతికి వెళ్లాడు. కానీ నాలుగు ఐదు గంటల పాటు ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నాడు. ఆపై నాగ్ నాగ్ పూర్ కు వెళ్లి , సూరత్ లో తనను కిడ్నాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
నితిన్ దేశ్ ముఖ్ తాను గుండె పోటుతో బాధ పడలేదని చెప్పారు. తమలోని కొందరికి బలవంతంగా ఇంజక్షన్లు ఇచ్చారని తెలిపారు. తిరుగుబాటు శిబిరంలో ఉండలేక తాను హార్ట్ ఎటాక్ వచ్చినట్లు నాటకం ఆడానంటూ చెప్పారు.
ఆస్పత్రిలో చేరడం ఒక సాకు మాత్రమేనని అన్నారు. అక్కడి నుంచి తాను నాటకీయంగా తప్పించుకున్నానని అన్నారు. తనను కిడ్నాప్ చేయడమే కాకుండా గుండె పోటుతో బాధ పడుతున్నట్లు నకిలీ క్లెయిమ్ తో సూరత్ లో ఆస్పత్రిలో చేర్చారని ఆరోపించాడు.
నేను అర్ధరాత్రి 12 గంటలకు హొటల్ నుండి బయటకు వచ్చాను. తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డుపైనే ఉన్నారు. నాకు వ్యాన్ రాలేదు.
నన్ను అనుసరించిన 100 మంది పోలీసులు నన్ను ఈడ్చుకుంటూ వచ్చారు. గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో చేర్చారంటూ బాంబు పేల్చారు.
Also Read : ‘శివ’ సైనికుల కంటతడి