Afghan Earthquake : ఆఫ్గాన్ లో భూకంపం వేయి మంది మరణం
సాయం చేయాలంటూ అభ్యర్థన
Afghan Earthquake : ఆఫ్గనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం(Afghan Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ 6.1గా నమోదైంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇంకా ఎంత మంది చని పోయారనేది లెక్కలు పూర్తిగా రాలేదు.
ప్రస్తుతం అందిన తాజా సమాచారం మేరకు అధికారికంగా 1,000 మంది భూకంపం దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్లు ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా తీవ్ర భూకంపు(Afghan Earthquake) తాకిడికి చెల్లాచెదురైన భవనాలు, ఇంకా శిథిలాల కిందే ఉన్న మృత దేహాలను వెలికి తీసే పనిలో పడింది సర్కార్.
ఇంకా మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ తెలిపింది ఆఫ్గనిస్తాన్ ఆధ్వర్యంలో నడిచే భక్తర్ వార్తా సంస్థ. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన వారిని యుద్ద ప్రాతిపదికన తరలిస్తున్నట్లు తెలిపింది.
సహాయక చర్యలు ముమ్మరం చేశారని, ఇతర దేశాలు మానవతా దృక్ఫథంతో సహాయం అందించాలని ఆప్గనిస్తాన్ కోరింది. ఇదిలా ఉండగా దేశంలోని తూర్పు ప్రాంతంలో అత్యధికంగా భూకంపం సంభవించింది.
కాగా గత ఏడాది దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న చారిటీ సంస్థలు, ఇతర సంస్థలు దేశం విడిచి వెళ్లి పోయాయి. బాధితులకు సాయం చేసేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఇళ్లు, భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఇదిలా ఉండగా భారతదేశం తనవంతు సాయం చేస్తానని తెలిపింది. ఈ మేరకు మిగతా దేశాలు సైతం స్పందించాలని కోరింది.
Also Read : ఆఫ్గాన్ లో భూకంపం ..