Rahul Gandhi : అగ్నిప‌థ్ స్కీంను విర‌మించుకోండి – రాహుల్

చివ‌ర‌కు స‌త్య‌మే గెలుస్తుంద‌న్న ఎంపీ

Rahul Gandhi : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీం ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

జాతీయ‌వాద‌మ‌ని ప‌దే ప‌దే చెప్పుకునే అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ శ‌క్తుల‌ను బ‌లోపేతం చేసేందుకు బ‌దులు వాటిని నిర్వీర్యం చేస్తోందంటూ ఆరోపించారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

సాయుధ ద‌ళాలు దేశ ర‌క్ష‌ణ‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తాయ‌ని, ఇందులో కాంట్రాక్టు వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు. వెంట‌నే దీనిని ర‌ద్దు చేయాల‌న్నారు రాహుల్ గాంధీ.

ఒక ర్యాంక్ ఒక పెన్ష‌న్ నుండి ఈ ప్ర‌భుత్వం ఎటువంటి ర్యాంక్ , పెన్ష‌న్ లేని స్థితికి చేరుకుందంటూ ఎద్దేవా చేశారు. చైనా 100 కిలోమీట‌ర్ల‌కు పైగా భార‌త భూభాగాన్ని ఆక్ర‌మించుకున్న స‌మ‌యంలో ఈ ప‌నికి దిగార‌న్నారు.

ఈ వాస్త‌వాన్ని ప్ర‌భుత్వం కూడా అంగీక‌రించింద‌ని చెప్పారు. యుద్దం జ‌రిగిన‌ప్పుడు సాయుధ బ‌ల‌గాల‌ను నిర్వీర్యం చేసినందుకు దేశం త‌గిన మూల్యం చెల్లించుకుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాగా తాము అధికారంలోకి వ‌స్తే అగ్నిప‌థ్ స్కీం ను పూర్తిగా ర‌ద్దు చేస్తామ‌ని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . ఈడీ న‌న్ను ప్ర‌శ్నించింది. కానీ నిరుద్యోగుల ఆందోళ‌న ముందు ఇది చాలా త‌క్కువ అని పేర్కొన్నారు.

దేశంలో చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను కావాల‌ని విచ్ఛిన్నం చేసిందంటూ మండిప‌డ్డారు. వీటిని నిర్వీర్యం చేయ‌డం వ‌ల్ల ఉపాధి గాలిలో దీపం లాగా మారింద‌న్నారు.

విప‌స‌నా ధ్యానాన్ని అభ్య‌సిస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ చెప్పారు. చివ‌ర‌కు స‌త్య‌మే గెలుస్తుంద‌న్నారు.

Also Read : నా బ‌లం ఏంటో చెప్పమ‌న్న ఈడీ

Leave A Reply

Your Email Id will not be published!