Uddhav Thackeray : క‌థ ముగిసింది క‌ల చెదిరింది

సీఎంఓ ఆఫీసు ఖాళీ చేసిన ఉద్ద‌వ్ ఠాక్రే

Uddhav Thackeray : ఎప్పుడు కూలిపోతుందో తెలియ‌ని ప‌రిస్థితిలో మ‌హారాష్ట్ర స‌ర్కార్ ను త‌న భుజాల మీద మోస్తూ వ‌చ్చిన శివ‌సేన చీఫ్ , సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) ఎట్ట‌కేల‌కు ముఖ్య‌మంత్రి అధికారిక నివాసం (సిఎంఓ) ను ఖాళీ చేశారు.

శివ‌సేన సైనికుల‌కు ఊహించ‌ని ప‌రిణామం. ఎప్పుడైతే శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపీ క‌లిసి మ‌హా వికాస్ అఘాడీగా ఏర్ప‌డి సంకీర్ణ ప్ర‌భుత్వాన్నిఏర్పాటు చేశాయో ఆనాటి నుంచి కేంద్రం వ‌ర్సెస్ మ‌రాఠాగా మారి పోయింది.

కేసులు, అరెస్ట్ లు, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్ల‌తో హోరెత్తింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచి దిగి పోయేంత దాకా మోదీ త్ర‌యం ( మోదీ,

అమిత్ షా, జేపీ న‌డ్డా ) తో ఢీకొన్నారు. శివ‌సేన ఎప్పుడూ త‌ల వంచ‌ద‌ని, ఆత్మ గౌర‌వానికి భంగం క‌లిగిన రోజున త‌ప్పుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ మేర‌కు తాను దిగి పోయేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు అర్ధ‌రాత్రి.

తాను సీఎంఓ ను ఖాళీ చేసే కంటే ముందు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. సొంత పార్టీ నేత‌లే త‌న‌ను వ్య‌తిరేకించ‌డం బాధ‌కు గురి చేసింద‌ని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు కోరితే తాను త‌ప్పుకునేందుకు రెడీగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

తన రాజీనామా లేఖ త‌న వ‌ద్దే ఉంద‌ని , ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ కు కూడా చెప్పాన‌ని తెలిపారు. తాను ఏం త‌ప్పు చేశాన‌నేది తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెల్ల‌డించాల‌ని సీఎం డిమాండ్ చేశారు.

షిండే న‌మ్మ‌క ద్రోహానికి పాల్ప‌డ్డాడంటూ ఆరోపించారు ఉద్ద‌వ్ ఠాక్రే.

Also Read : త‌ల వంచ‌ను త‌ప్పుకుంటా – ఠాక్రే

Leave A Reply

Your Email Id will not be published!