Eknath Shinde : అసహజ కూటమి నుండి తప్పుకోవాలి – షిండే
ఉద్దవ్ ఠాక్రేకు సవాల్ విసిరిన మంత్రి ఏక్ నాథ్
Eknath Shinde : మరాఠాలో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వస్తున్న శివసేన నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేపై నిప్పులు చెరిగారు. పైకి నీతులు చెబుతున్న సీఎం ఎందుకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నారంటూ ప్రశ్నించారు.
ముందు అసహజ కూటమి నుండి తప్పు కోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా మహా వికాస్ అఘాడీలో కూటమి భాగస్వామ్య పక్షాలు తిరుగుబాటు నాయకుడిని సీఎంగా నియమించాలని సూచించాయి.
కొద్ది సేపటికే ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శివసేన పార్టీకి ఓ ప్రత్యేకత ఉంది.
కానీ కేవలం అధికారం కోసమే పార్టీని తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. గత రెండున్నర ఏళ్లల్లో రాష్ట్రంలో శివసేన పార్టీ భారీ ఎత్తున నష్ట పోయిందని, ఈ విషయాన్ని సీఎం గుర్తించక పోవడం దారుణమన్నారు.
పార్టీకి తీరని నష్టం ఏర్పడితే కాంగ్రెస్ , ఎన్సీపీ పార్టీలు భారీ ఎత్తున లాభ పడ్డాయని పేర్కొన్నారు. ఇతర పార్టీలు బలపడిన చోట శివసేన బలహీన పడిందన్నారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde). ఈ సందర్భంగా కీలక సూచనలు కూడా చేశారు.
పార్టీని, శివ సైనికులను కాపాడేందుకు అసహజ కూటమి నుంచి బయటకు రావాలి. లేదంటే రద్దు చేయడం చాలా ముఖ్యమన్నారు.
మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. శివసేన బీజేపీతో పొత్తును పునరుద్దరించి రాష్ట్రాన్ని పాలించాలని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు.
Also Read : మరాఠా సీఎంగా ఏక్ నాథ్ షిండే ..?