Lawrence Bishnoi : వీడిన సిద్దూ కేసు మిస్టరీ లారెన్స్ సూత్రధారి
ఒప్పుకున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్
Lawrence Bishnoi : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది పంజాబ్ కు చెందిన ప్రముఖ సింగర్ సిద్దూ మూసే వాలా దారుణ హత్యకు గురయ్యాడు. ఏకంగా 36 బుల్లెట్ల వర్షం కురిపించారు.
ఇప్పటికే 9 మంది అనుమానితుల్ని పట్టుకున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమనల్ గా పేరొందాడు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) పోలీసులు హత్య జరిగిన నాటి నుంచి దర్యాప్తు ముమ్మరం చేశారు.
చివరకు లారెన్స్ బిష్ణోయ్ తానే సిద్దూ మూసే వాలా హత్యకు ప్లాన్ చేసినట్లు అంగీకరించాడు. అయితే కోర్టుకు ఎక్కాడు లారెన్స్. తనను పంజాబ్ పోలీసులకు అప్పగించవద్దని, తనను ఎన్ కౌంటర్ చేస్తారని కోరాడు.
దీనిని కోర్టు తిరస్కరించింది. గత మే నెల 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలలో తన ఊరుకు వెళుతుండగా దారి కాచి కాల్చి చంపారు. అతడితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులకు ఉన్న సెక్యూరిటీని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తొలగించారు.
ఆ మరుసటి రోజే ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ను ఢిల్లీ నుంచి పంజాబ్ తీసుకు వచ్చారు. ఏడు రోజులైంది. ఈ సందర్భంగా విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
అయితే సిద్దూ మూసే వాలాను హత్య చేసేందుకు తాను గత ఆగస్టు నెల నుంచి ప్లాన్ చేస్తూ వచ్చానని చెప్పాడు. ఆ హత్యకు సూత్రధారి తానేనని గ్యాంగ్ స్టర్ లారెన్స్ (Lawrence Bishnoi) ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అంతే కాకుండా సిద్దూ హత్యలో కీలక పాత్రధారిగా భావిస్తున్న బల్దేవ్ అలియాస్ నిక్కూను గురువారం అరెస్ట్ చేసినట్లు గ్యాంగ్ స్టర్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మిస్టర్ బాన్ తెలిపారు.
Also Read : ఎన్ఐఏ చీఫ్ గా మాజీ డీజీపీ దినకర్ గుప్తా