PM Modi : సమగ్రత ముఖ్యం సార్వభౌమత్వం అవసరం
స్పష్టం చేసిన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆయన కీలక సూచనలు చేశారు.
ప్రతి ఒక్క దేశం సార్వభౌమత్యాన్ని పరిరక్షించు కోవాలని, ఇదే సమయంలో సమగ్రత అన్నది ముఖ్యమని గుర్తించాలని అన్నారు మోదీ.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్ ) దేశాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఆఫ్గనిస్తాన్ , రష్యా యుద్దం, పేట్రేగుతున్న ఉగ్రవాదం, వాణిజ్యం తదితర ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
ఆయా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి(PM Modi). చైనా అధ్యక్షతన జరిగిన ఐదు దేశాల వర్చువల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
విచిత్రం ఏమిటంటే గ్లోబల్ పై పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న చైనా ఇందులో ఉండడం. యుద్ధం వల్ల అశాంతి తప్ప ఇంకేమీ ఉండదన్నారు. మానవీయ కోణంతో ఆలోచించి రష్యా యుద్ధాన్ని ఆపాలని కోరారు ప్రధానమంత్రి.
ఇదే సమయంలో యుద్ధ సమయంలో రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించింది. మరో వైపు సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రకాల టెర్రరిజంపై పోరాటం చేయాలని , ఇందు కోసం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు మోదీ(PM Modi).
ఈ మేరకు ప్రధాన మంత్రి చేసిన సూచనలను మిగతా సభ్య దేశాలు సమ్మతి తెలిపాయి.
ఇదే సమయంలో కరోనా తగ్గుముఖం పట్టినా ఇంకా దాని ప్రభావం ఉందని, దానిని ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయాలని కోరారు.
Also Read : ద్రౌపది ముర్ముకు మోదీ అభినందన