Sanjay Raut : శివ సైనికులు రోడ్ల‌పైకి వ‌స్తే క‌ష్టం – రౌత్

ఏక్ నాథ్ షిండే కు రౌత్ స్ట్రాంగ్ వార్నింగ్

Sanjay Raut : మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతూనే ఉంది. ఈ సంద‌ర్భంగా మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో మ‌రింత వేడి రాజేస్తున్నారు.

మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న శివ‌సేన నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే ఈ మొత్తం ఎపి సోడ్ కు సూత్ర‌ధారిగా ఉన్నారు. త‌న వెనుక 40 మందికి పైగా శివ సేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నార‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం అస్సాంలోని గౌహ‌తి రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో మ‌కాం వేశారు. చ‌ద‌రంగం ఆడుతున్నారు. త‌మ‌దే అస‌లైన శివ‌సేన పార్టీ అంటూ ప్ర‌క‌టించారు.

వీలైతే శివ‌సేన పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ ల‌ను వ‌దిలి రావాలంటూ కోరారు.

దీనిపై శివ‌సేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut) శుక్ర‌వారం సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఏక్ నాథ్ షిండేకు తెలియ‌కుండా సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ఏ ప‌ని చేయ‌లేద‌న్నారు.

ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌న్న విష‌యం ఏక్ నాథ్ కు కూడా తెలుస‌న్నారు. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ మొత్తం సంక్షోభానికి తెర లేపింద‌ని సంజ‌య్ రౌత్ ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో తమపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించిన ఏక్ నాథ్ ముండేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎంపీ. ఇప్ప‌టి దాకా మ‌రాఠాలో శివ సేన సైనికులు మౌనంగా ఉన్నార‌ని కానీ వాళ్లు రోడ్ల‌పైకి వ‌స్తే సీన్ వేరేగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : ఉద్ద‌వ్ ఠాక్రే క‌థ‌ ముగిసింది – అథవాలే

Leave A Reply

Your Email Id will not be published!