Meghalaya CM : మా నాన్న సంగ్మా చెప్పింది నిజమైంది – సీఎం
ఆదివాసీ బిడ్డకు రాష్ట్రపతి వస్తుందన్నారు
Meghalaya CM : మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా(Meghalaya CM) సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతోత మాట్లాడారు.
ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ఏదో ఒక రోజు ఆదివాసీ బిడ్డ కు అవకాశం దక్కుతుందని మా నాన్న దివంగత పీఎస్ సంగ్మా తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు.
అదే ఇవాళ నిజమైందని చెప్పారు సీఎం. మా నాన్న ఒక్కడి కలనే కాదు యావత్ భారత దేశంలోని ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, బహుజనులు, బలహీన వర్గాలందరి కోరిక కూడా అని పేర్కొన్నారు.
తాము భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీయే) తీసుకున్న నిర్ణయానికి బేషరత్తుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం కాన్రాడ్ సంగ్మా.
ఎన్డీయే ప్రభుత్వం తమ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. 24న శుక్రవారం ఆమె తన నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా మేఘాలయ సీఎం(Meghalaya CM) మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.
కాగా ద్రౌపది ముర్ముది పేద కుటుంబం. కష్టపడి చదువుకుంది. జూనియర్ అసిస్టెంట్ గా పని చేసింది. ఆ తర్వాత పంచాయతీ కౌన్సిలర్ గా ఎన్నికైంది. బీజేపీలో అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగింది.
ఒడిశా మంత్రివర్గంలో మంత్రిగా పలు శాఖలు నిర్వహించింది. 2015లో జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచింది.
మరో వైపు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలో ఉన్నారు.
Also Read : మధ్యప్రదేశ్ సీఎం డ్యాన్స్ అదుర్స్