Draupadi Murmu : ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు
మోదీతో పాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఎంపీలు
Draupadi Murmu : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల వయసు కలిగిన ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు.
ద్రౌపది ముర్ము వెంట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఎంపీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
బీజేపీ మిత్రపక్షాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ద్రౌపది ముర్ము(Draupadi Murmu) పార్లమెంట్ లో నామినేన్ వేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి సమర్పించారు.
అంతకు ముందు ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , ఆదివాసీ యోధుడు బిర్సా ముండా కు నివాళులు అర్పించారు.
ఇదిలా ఉండగా ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశా. ఆమె నిరుపేద ఆదివాసీ కుటుంబానికి చెందింది. చిన్నతనం నుంచే కష్టపడి చదువుకుంది. జూనియర్ అసిస్టెంట్ గా పని చేసింది.
అదే సమయంలో పంచాయతీ కౌన్సిలర్ గా ఎన్నికైంది. ఆనాటి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయిలో పని చేశారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ద్రౌపది ముర్ము రెండు సార్లు మంత్రిగా పని చేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీల కంఠ అవార్డు అందుకున్నారు. జార్ఖండ్ కు తొలి గవర్నర్ గా పనిచేశారు ద్రౌపది ముర్ము.
Also Read : మా నాన్న సంగ్మా చెప్పింది నిజమైంది – సీఎం