Canada PM : యుఎస్ సుప్రీం తీర్పు స్వేచ్ఛపై దాడి
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కామెంట్
Canada PM : అమెరికా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అబార్షన్ హక్కుల్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై యావత్ ప్రపంచం భగ్గుమంటోంది. ఇది చీకటి రోజుగా అభివర్ణించారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ , మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.
మరో వైపు కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సంచలన కామెంట్స్ చేశారు జస్టిన్ ట్రూడో.
ఇది అత్యంత భయంకరమైన తీర్పుగా పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా సోకడంతో ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తనను బాధకు గురి చేసిందన్నాడు.
ఏ ప్రభుత్వం , ఏ రాజకీయ నాయకుడు లేదా పురుషుడు , స్త్రీకి ఆమె శరీరంతో ఏం చేయగలదో, ఏం చేయకూడదనే చెప్ప కూడదని సూచించారు. ఇది పూర్తిగా స్వేచ్ఛను హరించడం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు కెనడా పీఎం(Canada PM).
రిపబ్లికన్ అధ్యక్షులు పేర్కొన్న ఆరుగురు న్యాయమూర్తులు 1973 నాటి రోయ్ వర్సెస్ వేడ్ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. దేశంలోని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుమతించవచ్చని కోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టు తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసనలు , ఆందోళనలు మిన్నంటాయి. మహిళల హక్కుల్ని కాలరాయడం పనిగా పెట్టుకున్నట్టుగా ఉందని ఆరోపించారు.
లక్షలాది మంది అమెరికన్ మహిళలు అబార్షన్ కు చట్ట బద్దమైన హక్కును కోల్పోతున్నందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో తెలిపారు.
ప్రస్తుతం అమెరికా ఆందోళనలతో భగ్గుమంటోంది.
Also Read : అబార్షన్ హక్కుల రద్దు దేవుడి తీర్పు – ట్రంప్