Maharastra Crisis : మ‌రాఠా సంక్షోభంపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

షిండేకు డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ బిగ్ షాక్

Maharastra Crisis : మ‌రాఠాలో రాజ‌కీయ సంక్షోభం(Maharastra Crisis) కొన‌సాగుతూనే ఉంది. ఒక ర‌కంగా విరాట ప‌ర్వాన్ని గుర్తుకు తెచ్చేలా చేస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాల‌ని కోరుతూ తిరుగుబాటు ప్ర‌క‌టించిన మంత్రి ఏక్ నాథ్ షిండే , ఎమ్మెల్యేల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు డిప్యూటీ స్పీక‌ర్.

త‌ను ఒప్పు కోలేదు. పైపెచ్చు పార్టీ రూల్స్ కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తించారంటూ వారిపై వేటు వేసేందుకు రెడీ అయ్యారు. ఈ త‌రుణంలో ఒక‌వేళ అన‌ర్హ‌త వేటు ప‌డితే త‌ను బ‌ల నిరూప‌ణ చేసేందుకు వీలు ఉండ‌దు.

ఒకవేళ మ‌రాఠాలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌ల‌వాలి. అస్సాంలోని గౌహ‌తి ఫైవ్ స్టార్ హోట‌ల్ ఉంటూ రాజ‌కీయం చేయ‌డం కుద‌ర‌దు. ఎలాగైనా స‌రే త‌మ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించాలంటే మ‌హారాష్ట్ర‌కు రావాల్సి ఉంటుంది.

ఇదే స‌మ‌యంలో శివ‌సేన సైనికులు రోడ్ల‌పైకి వ‌చ్చారు. శివ‌సేన ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కుట్ర ప‌న్నారంటూ ధిక్కార స్వ‌రం వినిపించిన వారిని టార్గెట్ చేశారు. ఆఫీసులు, ఇళ్ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. మ‌రో వైపు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే మంత్రులుగా ఉన్న వారు ఏయే ఫైల్స్ పై సంత‌కాలు చేశార‌నే దానిపై ఫోక‌స్ పెట్టారు.

వాటిని ర‌ద్దు చేశారు. గ‌వ‌ర్న‌ర్ కు క‌రోనా సోక‌డంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో ఉన్నారు. అసెంబ్లీ వ‌ర‌కు స్పీక‌ర్ దే అంతిమ నిర్ణ‌యం. ఇందులో గ‌వ‌ర్న‌ర్ కు కానీ కోర్టుకు కానీ జోక్యం చేసుకునేందుకు వీలు ఉండ‌దు.

దానిని ఆధారంగా చేసుకునే శివ‌సేన చీఫ్ బ‌లంగా దెబ్బ కొట్ట‌డం మొద‌లు పెట్టాడు. మ‌రో వైపు బీజేపీ కూడా వేచి చూసే ధోర‌ణి అవలంభిస్తోంది. చివ‌ర‌కు ఏక్ నాథ్ షిండే ఉద్ద‌వ్ ఠాక్రేతో క‌లిసి పోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేదు.

Also Read : శివ‌సేనను క‌దిలిస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!