Yashwant Sinha : తాను రబ్బర్ స్టాంప్ కానని నిరూపిస్తా
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
Yashwant Sinha : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఆదివారం కీలక, ఆస్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
రాష్ట్రపతి భవన్ అంటే ఇప్పటి వరకు రబ్బర్ స్టాంప్ వరకే పరిమితం అన్న అపవాదు ఎదుర్కొంటోంది. కానీ తనను గెలిపించి అవకాశం ఇస్తే తాను రబ్బర్ స్టాంప్ ను కానని నిరూపిస్తానని స్పష్టం చేశారు.
రాజకీయంగా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే సాధనంగా ప్రభుత్వ సంస్థల దుర్వినియోగానికి ముగింపు పలుకుతానని సిన్హా(Yashwant Sinha) పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రపతి భవన్ రబ్బర్ స్టాంప్ కంటే ఎక్కువ కావాలన్నారు.
తాను ఏ ధర్మ సంకటంలో లేనని కుండ బద్దలు కొట్టారు. వచ్చే నెల జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక వ్యక్తిగత పోటీ కంటే చాలా ఎక్కువ అన్నారు.
ప్రభుత్వ నిరంకుశ పోకడలను అడ్డుకునే దిశగా ఇది ఒక అడుగు అని ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా చెప్పారు. జాతీయ మీడియా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే తన తనయుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన జయంత్ సిన్హా మద్దతు తను పొంద లేనందుకు ఎలాంటి ధర్మ సంకటంలో లేనని అన్నారు.
కొడుకు రాజ్ ధర్మాన్ని అనుసరిస్తాడు. తాను రాష్ట్ర ధర్మాన్ని అనుసరిస్తానని వెల్లడించారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రతిఘటించే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు.
ఒక వ్యక్తి ఔన్నత్యం మొత్తం సమాజాన్ని ఉన్నతీకరించదని స్పష్టం చేశారు.
Also Read : యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది -మోదీ