Owaisi Jubair : జుబైర్ అరెస్ట్ అప్రజాస్వామికం – ఓవైసీ
నూపర్ శర్మను ఎందుకు అరెస్ట్ చేయలేదు
Owaisi Jubair : మతపరమైన వ్యాఖ్యలు చేశారని, ఓ వర్గాన్ని కించ పరిచేలా పోస్ట్ షేర్ చేశారంటూ ప్రముఖ జర్నలిస్ట్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు.
విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకులలో ఒకరైన సిన్హా మాత్రం అరెస్ట్ చేశారని కానీ ఎఫ్ఐఆర్ కు సంబంధించి కాపీ ఇవ్వలేదని ఆరోపించారు.
దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్రాన్ని తప్పు పట్టారు. సత్యాన్ని ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
మరో వైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహూహా మొయిత్రా సైతం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీసులు పై వారి మెప్పు పొందేందుకు ఇలాంటివి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తాజాగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మహ్మద్ జుబైర్(Owaisi Jubair) అరెస్ట్ పై స్పందించారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. ఇదే మత పరమైన వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు ఓవైసీ.
ఆయన ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జర్నలిస్ట్ అరెస్ట్ పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఢిల్లీ పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎంపీ ప్రశ్నించారు.
Also Read : మహ్మద్ జుబైర్ అరెస్ట్ దారుణం – రాహుల్