Revanth Reddy : భారత ఆర్థిక శక్తికి పీవీ చోదకశక్తి – రేవంత్
టీపీసీసీ చీఫ్ ఎనుముల
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీవీపై. కష్టాల్లో ఉన్న భారత దేశాన్ని గట్టెక్కించిన అరుదైన నాయకుడు దివంగత ప్రధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు (PV Narasimha Rao) అని ప్రశ్సించారు.
దేశం ఆర్థికంగా శక్తి వంతంగా నిలిచేందుకు పీవీ కారణమని పేర్కొన్నారు. భూ సంస్కరణలు తెచ్చి భూమి లేని పేదలకు భూమి ఇచ్చిన నాయకుడని కితాబు ఇచ్చారు రేవంత్ రెడ్డి(Revanth Reddy) .
ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు పీవీ అనుసరించిన విధానాలు, సరళీకృత విధానాలే కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి ఆయన అని ప్రశంసించారు.
మారుమూల పల్లె నుంచి వచ్చిన పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఎదిగారు. దివంగత ది బెస్ట్ పార్లమెంటేరియన్ గా పేరొందిన సూదిని జైపాల్ రెడ్డి పీవీ అడుగు జాడల్లో నడిచారని చెప్పారు.
పీవీ పుట్టిన వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్థం చేపట్టిన పనులు త్వరిత గతిన చేపట్టాలన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ ను నమ్మేందుకు వీలు లేదన్నారు.
మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందన్నారు. బయటకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని కేసీఆర్ లోపట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తున్నాడని ఆరోపించారు.
తాను ఎన్నో ఆరోపణలు చేశానని, సీబీఐకి ఫిర్యాదు చేసినా ఈరోజు వరకు కేసులు నమోదు చేయలేదన్నారు. కేసీఆర్ కు ఈగ వాలకుండా మోదీ చూసుకుంటున్నాడని ధ్వజమెత్తారు.
బీజేపీ నాయకులు ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు ఎందుకు సీబీఐ, ఈడీ దాడులు చేయడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy) .
Also Read : దేశానికే తలమానికం టీ-హబ్ – కేసీఆర్