Devendra Fadnavis : బలపరీక్షకు ఆదేశించండి – ఫడ్నవీస్
గవర్నర్ ను కలిసి విన్నవించిన బీజేపీ చీఫ్
Devendra Fadnavis : మరాఠాలో రాజకీయం మరింత ముదిరి పాకాన పడింది. చివరి అంకానికి చేరుకుంది. శివసేన పార్టీలో ధిక్కార స్వరం వినిపించిన మంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంలో 50 మంది ఉన్నట్లు ప్రకటించడం కలకలం రేపింది.
దీంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మైనార్టీలో పడింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే చివరి వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీంతో కోర్టు జూలై 12 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ శివసేన పార్టీ చీఫ్ విప్ , డిప్యూటీ స్పీకర్ ను ఆదేశించింది. మరో వైపు భారతీయ జనతా పార్టీ చకా చకా పావులు కదుపుతోంది.
ఇప్పటికే మాజీ సీఎం, బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కలిశారు. నేరుగా ఆయన గవర్నర్ కోషియార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
వెంటనే బల పరీక్ష నిరూపించు కోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సర్కార్ మైనార్టీలో పడిందని వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మరో వైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఫడ్నివీస్ మరింత దూకుడు పెంచాడు.
ఒక వేళ షిండే సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ ఉండే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : శాంతితోనే సమాజం మనుగడ – రాహుల్