Eknath Shinde : టచ్ లో ఉన్న వారెవరో చెప్పండి – షిండే
సీఎం ఉద్దవ్ ఠాక్రేకు బహిరంగ సవాల్
Eknath Shinde : మహారాష్ట్రలో రోజు రోజుకు రాజకీయం మరింత వేడి పుట్టిస్తోంది. శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) నేతృత్వంలో ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. వారంతా మొదటగా గుజరాత్ లోని సూరత్ లో బస చేశారు.
అక్కడి నుంచి అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ కు మకాం మార్చారు. అక్కడి నుంచే చక్రం తిప్పుతున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్ రెబల్స్ పై అనర్హత వేటు వేయడాన్ని తప్పు పట్టారు.
ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో షిండే వర్గానికి తాత్కాలిక ఊరట లభించింది. వచ్చే జూలై 12 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ను ఆదేశించింది.
ఇదే సమయంలో రెబల్స్ కు సీఎం విన్నవించారు రండి మాట్లాడుకుందామని. కానీ అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మరో వైపు భారతీయ జనతా పార్టీ చీఫ్ , మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కలిసిన అనంతరం నేరుగా ముంబైకి వచ్చారు. గవర్నర్ కోషియార్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీలో పడి పోయిందని , వెంటనే బల పరీక్షకు ఆదేశించాలని కోరారు.
ఈ తరుణంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు ఏక్ నాథ్ షిండే. తనతో టచ్ లో ఉన్నారని చెబుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరో, వారి పేర్లు బయట పెట్టాలని సవాల్ విసిరారు.
తన వద్ద 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. దీంతో షిండే సీఎంగా ఉంటాడా లేక ఫడ్నవీస్ మరోసారి సీఎం అవుతారా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : బలపరీక్షకు ఆదేశించండి – ఫడ్నవీస్