Eknath Shinde : విజ‌యం సాధించాల‌ని షిండే పూజ‌లు

ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు ముంబైకి

Eknath Shinde : గ‌త కొన్ని రోజులుగా కొన‌సాగుతూ ఉన్న మ‌రాఠా రాజ‌కీయ సంక్షోభానికి రేప‌టితో తెర ప‌డ‌నుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే తిరుగుబాటు ప్ర‌క‌టించిన మంత్రి ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలోని ఎమ్మెల్యేలు అస్సాం లోని గౌహ‌తి రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో మ‌కాం వేశారు.

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కోషియార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రేను ప్ర‌భుత్వానికి సంబంధించిన బ‌ల నిరూపుణ చేసుకోవాల‌ని ఆదేశించారు.

ఈనెల 30న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే గ‌డువు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి రికార్డ్ చేయాల‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్త‌తుం నంబ‌ర్ గేమ్ మ‌రాఠాలో న‌డుస్తోంది.

162 ఎమ్మెల్యేల బ‌లం ఉన్న మ‌హా వికాస్ అఘాడీలో షిండే గ్రూప్ తిరుగుబాటు చేయ‌డంతో ఆ సంఖ్యా బ‌లం 109కి ప‌డి పోయింది. ఇదే స‌మ‌యంలో 113 సీట్ల‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏకైక పార్టీగా ఉంది.

ఇదే విష‌యాన్ని ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి విన్న‌వించారు. దీంతో ఒక వేళ ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) వ‌ర్గం గ‌నుక బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం అన్న‌ది న‌ల్లేరు మీద న‌డ‌కే.

ఈ త‌రుణంలో గౌహ‌తిలో మ‌కాం వేసిన ఏక్ నాథ్ షిండే తామంతా ఈనెల 30న గురువారం మ‌హారాష్ట్ర‌కు చేరుకుంటామ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా షిండే గౌహ‌తి లోని ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ పూజ‌లు చేశారు. త‌మ‌కు విజ‌యం ద‌క్కాల‌ని.

Also Read : బ‌ల‌ప‌రీక్ష‌కు ఆదేశం రేపే ముహూర్తం

Leave A Reply

Your Email Id will not be published!