Sanjay Raut : గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం సంజ‌య్ రౌత్ ఆగ్ర‌హం

కేంద్ర స‌ర్కార్ నాట‌కాలు ఆడుతోంద‌ని ఫైర్

Sanjay Raut : మ‌హారాష్ట్ర‌లో నెల‌కొన్న సంక్షోభానికి తెర దించేందుకు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కోషియార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే కు బ‌లాన్ని నిరూపించు కోవాల్సిందిగా ఆదేశించారు.

ఈనెల 30 గురువారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే గ‌డువు విధించారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై నిప్పులు చెరిగారు శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్(Sanjay Raut)  .

బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం చ‌ట్ట విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు. 16 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల పై అన‌ర్హ‌త కేసు సుప్రీంకోర్టులో కొన‌సాగుతోంద‌ని, ఈ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ ఎలా నిర్ణ‌యం తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు సంజ‌య్ రౌత్.

బ‌ల‌ప‌రీక్ష ఎలా కొన‌సాగుతుంద‌న్నారు. ఎవ‌రి ప్రోద్బ‌లంతో గ‌వ‌ర్న‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆయ‌న ర‌ఫేల్ జెట్స్ కంటే వేగంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంజ‌య్ రౌత్(Sanjay Raut)  మండి ప‌డ్డారు.

రాజ్యాంగ విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇస్తోందంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు సంజ‌య్ రౌత్.

తాము ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన ఎమ్మెల్యేలు టూర్ ల‌తో కాల‌క్షేపం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

వారిని గోవా కూడా వెళ్ల‌నిస్తే బెట‌ర్ అని సూచించారు. ఇదిలా ఉండ‌గా గ‌వ‌ర్న‌ర్ జారీ చేసిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ శివ‌సేన కోర్టును ఆశ్ర‌యించింది.

ఇదిలా ఉండ‌గా శివ‌సేన త‌ర‌పున లాయ‌ర్ అభిషేక్ మ‌ను సంఘ్వి పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Also Read : విజ‌యం సాధించాల‌ని షిండే పూజ‌లు

Leave A Reply

Your Email Id will not be published!