Owaisi : ఎవరూ చట్టానికి అతీతులు కారు – ఓవైసీ
అప్రమత్తమై ఉంటే జరిగేది కాదు
Owaisi : హింస ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi) . రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన టైలర్ ను ఇద్దరు దారుణంగా చంపడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ తాము ఈ పని చేసినట్లు ప్రకటించారు. ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధానికి కూడా వార్నింగ్ ఇచ్చారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ తరుణంలో ఘటనలకు పాల్పడిన ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రం ఉగ్రవాద లింకులపై ఆరా తీసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశించింది.
తాజాగా విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఘటనకు పాల్పడిన నిందితులకు పాకిస్తాన్ గ్రూప్ లతో సంబంధాలు ఉన్నాయని, ఇందుకు గాను వీడియోలు చూశారని తెలిపారు.
ఇదే సమయంలో 10 మంది పాకిస్తాన్ వాసులతో మాట్లాడారంటూ తెలిపారు. ఇదిలా ఉండగా ఘటనపై తీవ్రంగా స్పందించారు ఓవైసీ. తాను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఇప్పటి వరకు ప్రవక్తపై నోరు పారేసుకున్న నూపుర్ శర్మను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అలా ముందే చేసి ఉంటే ఇంత పని జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
రాజస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోలేరన్నారు. ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు ఓవైసీ(Owaisi) .
Also Read : దేశానికే తలమానికం టీ-హబ్ – కేసీఆర్