Uddhav Thackeray : సీఎం ప‌ద‌వికి ఉద్ద‌వ్ ఠాక్రే గుడ్ బై

మ‌రాఠా పీఠం ఇక బీజేపీదే

Uddhav Thackeray : మ‌హారాష్ట్ర సంక్షోభానికి ఇక ఇవాల్టితో తెర‌ప‌డ‌నుంది. శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపీ క‌లిసి ఏర్పాటు చేసిన మ‌హా వికాస్ అఘాడి ప్ర‌భుత్వం శివ‌సేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయ‌డంతో మైనార్టీలో ప‌డి పోయింది.

చివ‌రి దాకా ఆ పార్టీ చీఫ్‌, సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ లేదు. చివ‌ర‌గా పార్టీ కీల‌క స‌మావేశంలో త‌ప్పు చేస్తే మ‌న్నించండి అంటూ భావోద్వేగానికి లోన‌య్యారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray).

దీంతో ఇక ఎంవిఏ కూలి పోవ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది. గురువారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు బ‌ల‌ప‌రీక్ష‌లో మీ బ‌లం ఏమిటో నిరూపించు కోవాలంటూ గ‌వ‌ర్న‌ర్ కోష్యార్ ఆదేశించారు సీఎం.

దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన శివ‌సేన‌కు చుక్కెదురైంది. గ‌వ‌ర్న‌ర్ ఆదేశంపై జోక్యానికి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నిరాక‌రించింది. రెండున్న‌ర ఏళ్ల‌పాటు కొలువు తీరిన ఠాక్రే ప్ర‌స్థానం ముగిసింది.

ఇదిలా ఉండ‌గా 288 స్థానాల‌కు గాను అతి పెద్ద పార్టీగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. తిరుగుబాటు జెండా ఎగ‌రేసిన ఏక్ నాథ్ షిండే వ‌ర్గీయుల‌కు బంప‌ర్ చాన్స్ ద‌క్క‌నుంది.

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ రెండోసారి సీఎంగా కొలువు తీర‌నుండ‌గా షిండే డిప్యూటీ సీఎంగా ఉంటారు. మొత్తంగా అమిత్ షా అనుకున్న‌ట్టే స‌ర్కార్ ఏర్పాటు కానుంది.

ఇదిలా ఉండ‌గా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు ఎదురుకాకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ఏది ఏమైనా శివ‌సేన పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ‌. కానీ ప్ర‌జాస్వామ్య ప‌రంగా చూస్తే ఇది పూర్తిగా విరుద్ద‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : మ‌నసు నొప్పిస్తే మ‌న్నించండి – ఉద్ధ‌వ్ ఠాక్రే

Leave A Reply

Your Email Id will not be published!