Bhagwant Mann : అవినీతిపరులు ఎక్కడున్నా వదలం – సీఎం
అవినీతి అంతం ఆప్ ప్రభుత్వ పంతం
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో అవినీతి అంతమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని మరోసారి ప్రకటించారు.
గురువారం భగవంత్ మాన్ మాట్లాడారు. గతంలో రాష్ట్రంలో కొలువు తీరిన పాలకులు ఖజానాను ఊడ్చేశారని, ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.
వాళ్లు ఏ పార్టీలో ఉన్న వారైనా, ఎంతటి స్థానంలో ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి చిట్టా బయటకు తీస్తామని, వారు దాచుకున్న, దోచుకున్న సొమ్మున్నంతా అణా పైసాతో సహా కక్కిస్తామని హెచ్చరించారు భగవంత్ మాన్.
ప్రతి పైసాను రికవరీ చేస్తామని చెప్పారు. అవినతి పరులు ఎవరూ చట్టం నుంచి తప్పించు కోలేరన్నారు . కొందరు కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారని దానిని తగ్గించు కోవాలని సూచించారు.
మీరు విమర్శలు గుప్పించినంత మాత్రాన వదిలే ప్రసక్తి లేదని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అవినీతి రహిత రాష్ట్రంగా పంజాబ్ ను తీర్చిదిద్దడమే తమ ముందున్న టార్గెట్ అన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే తమ ఉద్దేశమన్నారు భగవంత్ మాన్(Bhagwant Mann). విచిత్రం ఏమిటంటే నిన్నటి దాకా ప్రగల్భాలు పలికిన వారంతా తమను తాము రక్షించు కునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు సీఎం.
తప్పు చేయక పోతే, అవినీతికి పాల్పడక పోతే ఎందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు విద్య, ఆరోగ్య రంగాన్ని ప్రమాదంలోకి నెట్టి వేసిందని ఆరోపించారు.
ఆర్థిక మంత్రి అసెంబ్లీలో సమర్పించిన బడ్జెట్ పై ప్రసంగించారు భగవంత్ మాన్. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు పెన్షన్ రూ. 1000 ఇస్తామని ప్రకటించారు.
Also Read : ఉదయ్ పూర్ ఘటన బాధాకరం – తికాయత్