Eknath Shinde Fadnavis : మరాఠా సీఎంగా కొలువుతీరిన షిండే
డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
Eknath Shinde Fadnavis : మహారాష్ట్రలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. శివసేన రెబల్ గ్రూప్ కు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయన చేత రాష్ట్ర గవర్నర్ కోషియార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన , బీజేపీ
చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్(Eknath Shinde Fadnavis) డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
మొదట ఫడ్నవీస్ సీఎం అవుతారని అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తమ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆలోచించింది.
ఈ మేరకు షిండేకు సీఎంగా చాన్స్ ఇచ్చింది.
ఇవాళ బల పరీక్ష రద్దు చేయడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఇప్పటి వరకు కొలువు తీరిన మహా వికాస్ అఘాడీ
ప్రభుత్వం మైనార్టీలో పడి పోయింది.
దీంతో అతి పెద్ద సంఖ్యా బలం కలిగిన పార్టీగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చాన్స్ ఇవ్వాలని గవర్నర్ ను కోరింది. ఇదే సమయంలో లేఖ ఇచ్చారు ఫడ్నవీస్ . ఆయనతో పాటు రెబల్స్ కూడా లేఖలు అందజేశారు.
దీంతో పరిస్థితి తమ చేతుల్లో లేదని గ్రహించిన ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. నేరుగా తానే వెళ్లి గవర్నర్ కు అందజేశారు. మొత్తం
10 రోజుల పాటు నడస్తూ వచ్చిన మరాఠా రాజకీయం పూర్తిగా తెర పడింది ఇవాళ్టితో.
ఒకప్పుడు ఆటో రిక్షా నడిపిన ఆటో డ్రైవర్ ఏక్ నాథ్ షిండే ఇవాళ దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన మరాఠాకు చీఫ్ మినిస్టర్ గా ఎంపిక కావడం విశేషం.
ఇది పూర్తిగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందన్నది వాస్తవం.
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన ఫడ్నవీస్ తాను ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పారు.
Also Read : రెబల్ ఎమ్మెల్యేల డ్యాన్స్ అదుర్స్