Eknath Shinde Bala Saheb : మరాఠా యోధుడే నాకు ఆదర్శం
ట్విట్టర్ ప్రొఫైల్ మార్చేసిన ఏక్ నాథ్ షిండే
Eknath Shinde Bala Saheb : అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన ఏక్ నాథ్ షిండే ఇవాళ విస్మరించ లేని నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు బతుకు దెరువు కోసం ఆటో రిక్షా నడిపిన ఈ ఆటో డ్రైవర్ ఇప్పుడు దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైని గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
రాజకీయ రంగంలో ఉన్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధికైనా సీఎం, పీఎం కావాలని కోరిక ఉంటుంది. కానీ అది ఆచరణలోకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బీఎస్పీ సిద్దాంతకర్త, ఫౌండర్ కాన్షీ రామ్ చెప్పినట్లు మనీ ..మీడియా..మాఫియా డామినేట్ చేస్తున్న తరుణంలో తట్టుకుని నిలబడాలంటే దమ్ముండాలి. దీనినే ఆచరణలో చేసి చూపించాడు ఏక్ నాథ్ షిండే.
ముంబైకి పక్కనే ఉన్న థానే అతడి అడ్డా. సతారా స్వంతూరు. చిన్నప్పుడు ఎన్నో పనులు చేశాడు. 18 ఏళ్లకే శివసేన పట్ల ఆకర్షితుడయ్యాడు. మరాఠా యోధుడికి శిష్యుడిగా మారి పోయాడు.
మాస్ లీడర్ గా ఎదిగాడు. ఆపై మహారాష్ట్ర సీఎంగా కొలువు తీరాడు. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా తన ప్రస్తానాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయాడు ఏక్ నాథ్ షిండే.
తను ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేశాడు. తమదే అసలైన పార్టీ అని ప్రకటించాడు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మద్దతుతో పవర్ లోకి వచ్చాడు.
తాజాగా సోషల్ మీడియాలో తన ట్విట్టర్ ప్రొఫైల్ ను మార్చేశాడు ఏక్ నాథ్ షిండే. తాను ఆరాధించే మరాఠా యోధుడు దివంగత బాలా సాహెబ్ ఠాక్రే ఫోటో జత చేశాడు(Eknath Shinde Bala Saheb). ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Also Read : మరాఠా సీఎంగా కొలువుతీరిన షిండే