Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ ప‌వార్ కు ఐటీ ఝ‌ల‌క్

ఆదాయ వ్య‌యాల వివ‌రాలు ఇవ్వాల్సిందే

Sharad Pawar : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్రం మ‌రింత దూకుడు పెంచింది. త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ గా పెట్టుకుంది. త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకున్న మ‌హారాష్ట్ర స‌ర్కార్ ను కూల్చి వేసింది. చెప్పిన టైం లోపే దించేసిందన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇదే స‌మ‌యంలో విప‌క్షాల‌కు పెద్ద దిక్కుగా ఉన్న శ‌ర‌ద్ ప‌వార్ కు చెక్ పెట్టింది. ఈ మేర‌కు ఎన్సీపీ చీఫ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ఓ వైపు మ‌హా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్ర‌భుత్వం కుప్ప కూల‌డం, శివ‌సేన పార్టీ రెబ‌ల్ ఏక్ నాథ్ షిండే సీఎం కావ‌డంతో రాజ‌కీయాలు మ‌రింత వేడిని పుట్టిస్తున్నాయి.

ఊహించ‌ని రీతిలో సీఎం ఉద్ద‌వ్ త‌న కాలంలో తీసుకున్న నిర్ణ‌యాల‌పై తాజా సీఎం షిండే న‌జ‌ర్ పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఆయ‌న కొలువు తీరి 24 గంట‌లు కాక ముందే ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన శ‌ర‌ద్ ప‌వార్(Sharad Pawar) కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఐటీ శాఖ‌.

ఈ మేర‌కు నోటీసులు జారీ చేసింది. ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పొందు ప‌ర్చిన ఆస్తులు, ఆదాయ వివ‌రాల‌పై వీటిని జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌వార్ కు ఐటీ నోటీసులు ఇవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపింది.

కాగా ఐటీ శాఖ త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు శ‌ర‌ద్ ప‌వార్. 2004, 2009, 2014, 2020 సంవ‌త్స‌రాల ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌జేసిన వివ‌రాల గురించి నోటీసుల్లో అడిగార‌ని తెలిపారు.

దీని గురించి తానేమీ ఆందోళ‌న‌కు గురి కావ‌డం లేదంటూ స్ప‌ష్టం చేశారు ట్రబుల్ షూట‌ర్.

Also Read : అవినీతిప‌రులు ఎక్క‌డున్నా వ‌ద‌లం – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!