Eknath Shinde & Thackeray : ఉద్దవ్ ఠాక్రేకు ఏక్ నాథ్ షిండే షాక్
మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టుపై ఆదేశం
Eknath Shinde & Thackeray : మహా రాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలపై కొత్తగా కొలువు తీరిన మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde & Thackeray) ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయాని తిప్పికొట్టారు.
ముంబై లోని వివాదాస్పద మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టుపై వైఖరిని ఎండగట్టారు. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ హయాంలో అనుకున్న ప్రకారం ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ ను నిర్మిస్తామని కోర్టులో సమర్పించాలని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోనిని షిండే ఆదేశించినట్లు సమాచారం.
ఆ ఏడాది దీనిని నిర్మించడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ కార్యకర్తలు ముంబైలో భారీగా నిరసనలు చేపట్టారు.
ఇదే సమయంలో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ ఆరే కాలనీలో చెట్లను నరికి వేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)
అనుమతి కోరింది.
అయితే బీఎంసీ ప్రాజెక్ట్ కి ఆమోదం తెలిపిన వెంటనే నిరసనలు ప్రారంభం అయయాయి. తమ ఆందోళనను ఉదృతం చేయడంతో ఆనాటి
సీఎం ఫడ్నవీస్ మెట్రో కార్ షెడ్ కోసం గుర్తించిన ప్రాంతం జీవ వైవిధ్యం లేదా అటవీ భూమిగా గుర్తించ లేదు.
మెట్రో వల్ల పర్యావరణానికి పెద్ద దెబ్బ అని కార్యకర్తలు ఆరోపించారు. ఇది ఇలా కొనసాగుతుండగానే ఆ ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ
ఎన్నికల తర్వాత శివసేన తన బీజేపీతో విడి పోయింది.
ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో మహా వికాస్ అఘాడి ఏర్పడింది. దీంతో కార్యకర్తల నిరసనలను దృష్టిలో ఉంచుకుని మెట్రో కార్ షెడ్ ను
కంజుర్ మార్గ్ కు మార్చాలని నిర్ణయించింది.
కేంద్ర సర్కార్ 2020లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ భూమి తమ శాఖకు చెందిందని వాదించింది. కోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి
ప్రాజెక్టు పనులు నిలిచి పోయాయి.
ఇదిలా ఉండగా సీఎం షిండే చర్య తీసుకున్న వెంటనే ముంబై మెట్రో పనులను తిరిగి ట్రాక్ లోకి తీసుకు వస్తామంటూ బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ట్వీట్ చేయడం విశేషం.
Also Read : ఎన్సీపీ చీఫ్ పవార్ కు ఐటీ ఝలక్