Punjab CM : ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ – సీఎం
ఎన్నికల హామీని అమలు చేస్తున్నాం
Punjab CM : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ లోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉచితంగా 300 యూనిట్ల లోపు విద్యుత్ అందజేస్తామని ప్రకటించారు.
ఆ మేరకు పంజాబ్ రాష్ట్ర చరిత్రలో ఊహించని రీతిలో బంపర్ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించినట్లు ఆప్ చీఫ్ భగవంత్ మాన్ ను సీఎంగా కొలువు తీరారు.
ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సమావేశంలో తమ ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించిన విధంగానే ఇవాల్టి నుంచే పంజాబ్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్(Punjab CM) ప్రకటించారు.
ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రాష్ట్రంలో పాలించిన ప్రభుత్వాలు ప్రజలను పట్టించు కోలేదని, సమస్యలను గాలికి వదిలి వేశారంటూ మండిపడ్డారు.
కానీ తాము ఏది చెప్పామో అదే ఆచరణలో చేసి చూపిస్తున్నామని చెప్పారు. తమ సర్కార్ ప్రధాన లక్ష్యం పంజాబ్ ను అవినీతి రహిత రాష్ట్రంగా చేస్తామన్నారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా సరే వారిని వదిలి పెట్టమని హెచ్చరించారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ జైలుకు తరలిస్తామని, వారి నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని సీఎం(Punjab CM) ప్రకటించారు.
విద్య, ఆరోగ్యం, ఉపాధి తమ ప్రధాన ఎజెండా అని మరోసారి స్పష్టం చేశారు భగవంత్ మాన్.
Also Read : జూన్ లో భారీగా పెరిగిన జీఎస్టీ ఆదాయం