Sanjay Raut : పత్రా చాల్ హౌసింగ్ కాంప్లెక్స్ పునారభివృద్దిలో జరిగిన స్కాంకు సంబంధించి శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉదయం 11.30 గంటల నుండచి రాత్రి 9.30 గంటల వరకు విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా సంజయ్ రౌత్ ను విచారించింది.
ప్రశ్నల వర్షం కురిపించింది. సంజయ్ రౌత్(Sanjay Raut) దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి ఉదయమే చేరుకున్నారు. రాత్రికి వెళ్లి పోయారు.
ఈడీ విచారణ అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. విచారణ సంస్థకు సహకరిస్తానని చెప్పారు. ఏజెన్సీ పని దర్యాప్తు చేయడమే. వారి విచారణకు సహకరించడమే తమ పని అని పేర్కొన్నారు.
వాళ్లు నోటీసు ఇచ్చారు. ఆపై ఫోన్ కూడా చేశారు. అందుకే వచ్చా. వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఎలాంటి అనుమానం అందాల్సిన అవసరం లేదన్నారు.
పాత్రా చాల్ హౌసింగ్ కాంప్లెక్స్ రీడెవలప్ మెంట్ లో జరిగిన స్కాం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు. ఇందుకు సంబంధించి సంజయ్ రౌత్ కుటుంబ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో భారీ సంఖ్యలో శివసేన కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఈడీ చుట్టూ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఆఫీసుకు వెళ్లే రహదారలపై బారికేడ్లు వేశారు.
గత నెల జూన్ 28న సమన్లు ఈడీ పంపింది. కాగా సంజయ్ రౌత్ ఇది కేంద్రం తనపై కక్షకట్టి దర్యాప్తునకు ఆదేశించిందని ఆరోపించారు.
Also Read : శివసేన పార్టీ నుంచి షిండే బహిష్కరణ