Udaipur Tailor Son : మర్డర్ చేసినోళ్లకు మర్యాద చేస్తారా
హత్యకు గురైన దర్జీ కొడుకు షాకింగ్ కామెంట్స్
Udaipur Tailor Son : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ టైలర్ దారుణ హత్య. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఇద్దరు దుండగులు ఈ హత్య తామే చేశామంటూ ప్రకటించారు.
ఆపై వీడియోను కూడా పోస్ట్ చేశారు. అంతే కాదు ప్రధాన మంత్రిని ఇలాగే చంపేస్తామంటూ ప్రకటించారు. దీనిని సీరియస్ గా తీసుకుంది కేంద్రం. వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది.
విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ ఇద్దరికీ పాకిస్తాన్ లోని కరాచీ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నాయని వెల్లడించింది. ఆపై 2014లో కరాచీకి కూడా వెళ్లి వచ్చారంటూ తెలిపారు.
ఈ తరుణంలో దారుణ హత్యకు గురైన టైలర్ కొడుకు యశ్ తేలీ(Udaipur Tailor Son) స్పందించాడు. ప్రాణ హాని ఉందని ముందే ఫిర్యాదు చేశామని, కానీ సకాలంలో పోలీసులు స్పందించ లేదని ఆరోపించారు.
దీంతో ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఘటన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకవేళ వెంటనే అలర్ట్ అయి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని, తన తండ్రి కన్హయ లాల్ బతికి ఉండేవాడని కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు.
తన తండ్రిని చంపిన రాక్షసులను ప్రాణాలతో ఉంచ కూడదన్నాడు, ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశాడు. వారిని జైళ్లో కూర్చోబెట్టి ప్రజలు పన్నులు చెల్లించిన రూపాయిలతో మేపాల్సిన అవసరం లేదన్నాడు.
అలాంటి మృగాలకు బతికే హక్కు లేదన్నాడు. సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నా శిక్ష విధించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు.
Also Read : మహ్మద్ జుబైర్ పై కొత్తగా అభియోగాలు