TRS BJP Flexis : భాగ్య‌న‌గ‌రం కాషాయం గులాబీమ‌యం

టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ ఫ్లెక్సీలతో న‌గ‌రం

TRS BJP Flexis : తెలంగాణ‌లో రాజ‌కీయాలు వేడెక్కాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదంతా పైకి క‌నిపించే నాట‌కం త‌ప్పా మ‌రొక‌టి కాదంటోంది. పైకి విమ‌ర్శించుకుంటారు.

కానీ లోప‌ల అంతా ఒక్క‌టేన‌ని అంటోంది. తాజాగా భాగ్య‌న‌గ‌రం సెంట‌ర్ ఆఫ్ పాయింట్ గా మారింది. దేశం యావ‌త్తు ఇప్పుడు హైద‌రాబాద్ వైపు చూస్తోంది.

దీనికంతటికీ కార‌ణం కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ చాన్నాళ్ల త‌ర్వాత పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఏర్పాటు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో దేశానికి సంబంధించి అత్యున్న‌త ప‌ద‌విగా భావించే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌రుగుతోంది.

ఇందులో భాగంగా బీజేపీ ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌప‌ది ముర్మును ఎంపిక చేస్తే విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను ఎంపిక చేశారు. ఆల్ రెడీ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో ప‌వ‌ర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి ఊహించని విధంగా బీజేపీకి కాకుండా విప‌క్షాల అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తోంది. శ‌నివారం య‌శ్వంత్ సిన్హా హైద‌రాబాద్ కు వ‌చ్చారు.

మ‌రోవైపు బీజేపీ నుంచి ప్ర‌ధాని, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు, సీనియ‌ర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వ‌స్తున్నారు. ఇక సిన్హాకు భారీ స్వాగ‌తం ఏర్పాట్లు చేసింది టీఆర్ఎస్. స్వ‌యంగా సీఎం కేసీఆర్ సిన్హాకు స్వాగ‌తం ప‌లికారు.

ఆయ‌న వెంట మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌ర్సెస్ తెలంగాణ రాష్ట్ర స‌మితిగా మారి పోయింది.

ఇరు పార్టీలు పోటా పోటీగా కాషాయ‌, గులాబీ జెండాలు(TRS BJP Flexis) ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం భాగ్య‌న‌గ‌రం కాషాయం, గులాబీమ‌యంగా మారింది. ఇంకొ వైపు పోలీసుల ఆధీనంలో ఉంది.

Also Read : య‌శ్వంత్ సిన్హాకు కేసీఆర్ స్వాగ‌తం

Leave A Reply

Your Email Id will not be published!