Pawan Khera : ద‌ర్జీ హ‌త్య‌పై ప‌వ‌న్ ఖేరా షాకింగ్ కామెంట్స్

ద‌ర్జీ హ‌త్య కేసులో నిందితుడు మా కార్య‌క‌ర్త కాదు

Pawan Khera : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ ద‌ర్జీ హ‌త్య కేసు. ఇద్ద‌రు నిందితులు ఈ హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఆపై వీడియో కూడా పోస్ట్ చేశారు. ఆ ఇద్ద‌రినీ పోలీసులు అరెస్ట చేశారు.

క‌థ ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. కానీ హ‌త్య చేసిన నిందితుల్లో ఒక‌రు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కార్య‌క‌ర్త అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ఆపై పోస్టుల‌తో హోరెత్తించింది ట్విట్ట‌ర్ లో. హంతుకుల్లో ఒక‌రిని స్థానిక బీజేపీ నేత‌ల‌తో ఉన్న పాత సోష‌ల్ మీడియా పోస్టుల‌ను ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారం క‌ల‌కలం రేగింది. దీంతో త‌మ‌కు ఎలాంటి సంబంధాలు లేవంటూ బీజేపీ మైనార్టీ విభాగం చీఫ్ సాదిక్ ఖాన్ చెప్పారు. ఈ హ‌త్య రాజ‌స్తాన్ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మ‌ని ఆరోపించారు.

బాధితుడు త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ ముందస్తుగా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించ లేద‌ని మండిప‌డ్డారు. అయితే కేంద్రం ఆదేశించాక కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ వెంట‌నే విచార‌ణ ప్రారంభించిందా అంటూ కాంగ్రెస్ ప్ర‌శ్నించింది.

ఇదే విష‌యంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ప‌వ‌న్ ఖేరా(Pawan Khera)  కూడా దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. క‌న్హ‌య్య లాల్ ను చంపిన వారిలో రియాజ్ అత్తారీ బీజేపీ స‌భ్యుడంటూ ఆరోపించారు.

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండ‌గా ద‌ర్జీని హ‌త్య చేసిన ఇంద్ద‌రు నిందితులు రియాజ్ అక్త‌రీ, గౌస్ మ‌హ్మ‌ద్ ల‌ను 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపారు.

రాజ‌స్తాన్ బీజేపీ నాయ‌కు, మాజీ మంత్రి గులాబ్ చంద్ క‌టారియా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న‌ట్లు తెర‌పైకి వ‌చ్చింద‌ని ఖేరా ఆరోపించారు.

Also Read : మ‌ర్డ‌ర్ చేసినోళ్ల‌కు మ‌ర్యాద చేస్తారా

Leave A Reply

Your Email Id will not be published!