Nama Nageswara Rao : నామా నాగేశ్వర్ రావుకు ఈడీ ఝలక్
రూ. 96 కోట్ల ఆస్తులను జప్తు చేసిన వైనం
Nama Nageswara Rao : పవర్ ఎక్కడుంటే ఆ జెండా పట్టుకునే టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు కోలుకోలేని షాక తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏకంగా నామాకు చెందిన రూ. 96 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా రుణాలు తీసుకున్నారు. ఆ డబ్బులను ఇతర వాటికి తరలించినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో మధుకాన్ సంస్థలకు చెందిన 105 స్థిర, చరాస్థులను పూర్తిగా నిలిపి వేసింది ఈడీ.
అంతే కాకుండా రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్ కేసులో కూడా ఆస్తులను జప్తు చేసింది. వీటితో పాటు హైదరాబాద్ , విశాఖ పట్టణం, పశ్చిమ
బెంగాల్ లో కూడా నామా నాగేశ్వర్ రావుకు సంబంధించిన రూ. 88.85 కోట్ల స్థిర, చరాస్థులను ఈడీ అటాచ్ చేసింది.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు నామా నాగేశ్వర్ రావు(Nama Nageswara Rao). ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా బలపాల నామా ది స్వస్థలం. 15 మార్చి 1957లో పుట్టారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సభ్యునిగా ఉన్నారు నామా నాగేశ్వర్ రావు. మొదటి సారిగా లోక్ సభకు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిపై లక్ష ఓట్ల తేడాతో ఓడి పోయారు. తిరిగి అదే అభ్యర్థి మీద 2009లో పోటీ చేసి 1,25,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుండి 11,000 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమి పొందారు. 21 మార్చి 2019లో
టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.
ఆ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు నామా నాగేశ్వర్ రావు. ఏపీ, తెలంగాణలో విజయవంతమైన వ్యాపారవేత్తగా
పేరొందారు. మధుకాన్ కంపెనీకి చైర్మన్ గా ఉన్నాడు.
ఈ సంస్థ గ్రానైట్ , కాంట్రాక్ట్ లు, విద్యుత్త ఉత్పత్తి కేంద్రాలు, ఇతర వ్యాపారాలు చేస్తోంది. తన ఆస్తుల విలువ రూ. 173 కోట్లుగా ప్రకటించాడు
నామా నాగేశ్వర్ రావు.
Also Read : కేటీఆర్ పై విశ్వబ్రాహ్మణుల కన్నెర్ర