Smriti Irani : కేసీఆర్ సీఎం కాదు ఓ నియంత – స్మృతి ఇరానీ
ప్రధాని మోదీని కావాలని అవమానించారు
Smriti Irani : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్ పై. ఆయన తనను తాను ఓ నియంతగా భావిస్తున్నారని, కానీ రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన సీఎం గా వ్యవహరించడం లేదంటూ ఆరోపించారు.
ఆమె సీఎంపై ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి వస్తున్నారని తెలిసినా అక్కడికి వెళ్ల లేదని మండిపడ్డారు. ఆయన ప్రధానిని అవమానించినట్లు కాదని భారత రాజ్యాంగాన్ని వెక్కించినట్లేనని పేర్కొన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం అదే సమయంలో ప్రధాన మంత్రికి ఎందుకు ఆహ్వానం పలక లేక పోయారని ప్రశ్నించారు. ఇదంతా కావాలని చేయడం తప్ప మరొకటి కాదన్నారు.
గతంలో కూడా ఇలాగే వ్యవహరించారంటూ ఆరోపించారు. ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగిన సీఎం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇదేనా అని నిలదీశారు.
ఇలాంటి వ్యవహారం ప్రజాస్వామ్యంలో ఉండదన్నారు. ఇలాంటి దురహంకార పూరిత ప్రవర్తన కేవలం రాచరికాలలో మాత్రమే ఉంటుందన్నారు. అందుకే కేసీఆర్ తనను తాను రాజుగా భావించుకుంటున్నారని ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ(Smriti Irani) .
సీఎం రాజ్యాంగాన్నే కాదు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కూడా ఉల్లంఘించారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయాలు సర్కస్ కావచ్చు.
కానీ మాకు ప్రజలే ముఖ్యమన్నారు. ప్రధానిని అవమానించిన సీఎం దేశానికి ఎన్నడూ నాయకుడు కాలేడన్నారు. కుటుంబానికి సేవ చేయడం ఒక బాధ్యత అని భావించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వీకరించే బాధ్యతను నిర్వర్తించని వ్యక్తి ఎప్పటికీ రోల్ మోడల్ కాలేడని స్పష్టం చేశారు.
Also Read : మోదీ పీఎం కాదు ఓ సేల్స్ మెన్