Rahul Narwekar : మ‌రాఠా స్పీక‌ర్ గా రాహుల్ నార్వేక‌ర్

బ‌ల‌ప‌రీక్ష‌కు మ‌రాఠా ప్ర‌భుత్వం సిద్దం

Rahul Narwekar : గ‌త ప‌ది రోజులుగా ఉత్కంఠ రేపుతూ వ‌చ్చిన మ‌రాఠా సంక్షోభానికి తెర ప‌డింది. ఇప్ప‌టికే ఏక్ నాథ్ షిండే సీఎంగా కొలువు తీర‌గా దేవేంద్ర ఫడ్న‌వీస్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరితో గ‌వ‌ర్న‌ర్ కోషియార్ బ‌ల‌పరీక్ష‌కు సిద్దం కావాల‌ని ఆదేశించారు.

ఈ మేర‌కు ధిక్కార స్వ‌రం ప్ర‌క‌టించిన రెబ‌ల్ ఎమ్మెల్యేలు గోవా నుంచి ముంబైకి విచ్చేశారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు డిప్యూటీ స్పీక‌ర్ మాత్ర‌మే ఉన్నారు. తాజాగా అసెంబ్లీకి సంబంధించిన స్పీక‌ర్ ప‌ద‌వి కోసం ఆదివారం ఎన్నిక జ‌రిగింది.

సీఎం, డిప్యూటీ సీఎం ప్ర‌మాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల త‌ర్వాత ఇది చోటు చేసుకుంది. ఇదిలా ఉండ‌గా సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేశాక తొలిసారి శాస‌న‌స‌భ‌లో కొత్త స్పీక‌ర్ ను ఎన్నుకున్నారు.

288 మంది స‌భ్యుల‌కు గాను ఇద్ద‌రు చ‌ని పోయారు. కొత్త స్పీక‌ర్ ఎన్నిక‌కు సంబంధించి జ‌రిగిన ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ నార్వేక‌ర్(Rahul Narwekar)  ఎన్నిక‌య్యారు.

మెజారిటీ ఓట్లు సాధించాడు. రెండు రోజుల ప్ర‌త్యేక స‌మావేశాలు స్పీక‌ర్ ఎన్నిక అజెండాలో మొద‌టి అంశంగా ప్రారంభ‌మైంది. కొలాబా నుండి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలుపొందారు.

ఇదిలా ఉండ‌గా నార్వేక‌ర్ పై పోటీ చేసేందుకు శివ‌సేన – ఎన్సీపీ – కాంగ్రెస్ తో కూడిన మ‌హా వికాస్ అఘాడికి చెందిన , శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేకు విధేయుడిగా పేరొందిన రాజ‌న్ సాల్విని రంగంలోకి దింపింది.

Also Read : భార‌త వ్యాపారుల‌కు శ్రీ‌లంక ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!