PM Modi : తెలంగాణ అభివృద్దికి కృషి చేశాం – మోదీ
రాష్ట్ర ప్రజలంతా వచ్చినంత ఆనందం కలుగుతోంది
PM Modi : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశామని, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి.
అనంతరం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. భారీ ఎత్తున జనం తరలి వచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ ను అభినందించారు. బీజేపీ శ్రేణులతో దద్దరిల్లి పోయింది సభా ప్రాంగణం. గతంలో ఎన్నడూ లేని రీతిలో మోదీ(PM Modi) తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం.
తెలంగాణ సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వాసులంతా ఇక్కడికి వచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. మీరు నా పట్ల చూపిన ప్రేమకు, ఆదరాభిమానాలకు ఆనందం కలుగుతోందని చెప్పారు ప్రధాన మంత్రి.
హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతోందని, బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తోందని చెప్పారు. తెలంగాణ గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. ఇది పూర్తిగా త్యాగాలకు, బలిదానాలకు, పరాక్రమాలకు పెట్టింది పేరని కొనియాడారు మోదీ.
కాకతీయుల వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పదన్నారు. తెలంగాణ అభివృద్దే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని చెప్పారు ప్రధాన మంత్రి మోదీ(PM Modi).
బలహీన వర్గాల కోసం బీజేపీ పాటు పడుతోందన్నారు. సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్ కోసం పని చేస్తున్నామన్నారు. కరోనా కాలంలో సైతం ఉచితంగా వ్యాక్సిన్లు అందజేశామని చెప్పారు.
Also Read : రాహుల్ గాంధీ మనసు దోచిన చిన్నారి