PM Modi : మ‌హిళా సంక‌ల్పం గొప్ప‌ది – మోదీ

ద్రౌప‌ది ముర్ముకు ప్ర‌యారిటీ ఇచ్చాం

PM Modi : మ‌హిళ‌లు త‌లుచుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌ర‌ని నిరూపించ‌గ‌ల‌రు. అలాంటి వారికి ఆద‌ర్శ ప్రాయంగా ఉన్న వారిలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ద్రౌప‌ది ముర్ము (Draupadi Murmu) ఒక‌ర‌ని అన్నారు.

ఆదివాసీ తెగ‌కు చెందిన ఆమె చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డి అంచెంల‌చెలుగా ఎదిగార‌ని కొనియాడారు. జూనియ‌ర్ అసిస్టెంట్ నుంచి గ‌వ‌ర్న‌ర్ స్థాయికి ఎదిగార‌ని, ప్ర‌స్తుతం దేశానికి అత్యున్న‌త ప‌ద‌విగా భావించే రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎంపిక కాబోతోంద‌ని ప్ర‌శంసించారు మోదీ.

ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను గుడ్డిగా విమ‌ర్శించ‌డం మాను కోవాల‌ని సూచించారు పార్టీ శ్రేణుల‌కు. వారి నుంచి కూడా మంచిని స్వీక‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రావాల‌ని పిలుపునిచ్చారు.

నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని అన్నారు. సానుకూల దృక్ఫ‌థంతో ముందుకు వెళ్లాల‌న్నారు. ప‌టేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి అయినా భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామ‌ని, అంతే కాదు ఇప్ప‌టి వ‌ర‌కు దేశాన్ని పాలించిన ప్ర‌ధాన మంత్రులంద‌రికి సంబంధించి దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ్యూజియం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు మోదీ(PM Modi) .

ప్ర‌జాస్వామ్య పాల‌న‌పై చిత్త‌శుద్ది వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి. పార్టీకి చెందిన శ్రేణులు మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

ప్ర‌జా ప్ర‌తినిధులంతా ఎలాంటి పొర‌పాట్లు చేయ‌కుండా త‌మ విలువైన ఓటు ను వినియోగించు కోవాల‌ని సూచించారు మోదీ. సాధార‌ణ స్థాయి నుంచి అసాధార‌ణ స్థాయికి ఎదిగింద‌ని, ఆమె ప్ర‌స్థానం ఎంద‌రికో ఆద‌ర్శం కావాల‌న్నారు.

మ‌హిళ‌లు త‌లుచుకుంటే ఏదైనా చేయ‌గ‌ల‌ర‌ని ముర్మును చూసి నేర్చుకోవాల‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

Also Read : వైఫ‌ల్యాలు విజ‌యానికి సోపానాలు – పీఎం

Leave A Reply

Your Email Id will not be published!