PM Modi : అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
అల్లూరి ఓ అగ్నికణమన్న సీఎం వైఎస్ జగన్
PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi) ఏపీలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో విజయ సంకల్ప యాత్ర లో పాల్గొన్నారు. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపారు.
భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వ భూషణ్ , హరిచందన్ , సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం ప్రధాన మంత్రి మోదీని ఘనంగా సన్మానం చేశారు.
ఆయనకు శాలువా కప్పారు. ఆపై విల్లంబు బహూకరించారు. సభా వేదిక నుంచే వర్చువల్ వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్లణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాన మంత్రి మోదీ ఆవిష్కరించారు.
అంతకు ముందు హైదరాబాద్ నుంచి నేరుగా భీమవరం చేరుకున్నారు. పెద అమీరంలో సభా వేదికను ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ-17 ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి భీమవరంకు చేరుకున్నారు.
అల్లూరి సీతా రామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి ఆంగ్లేయులపై యుద్దం ప్రకటింంచిన గొప్ప నాయకుడు అల్లూరి సీతారామరాజు అంటూ కితాబు ఇచ్చారు మోదీ(PM Modi).
అల్లూరి ఓ అగ్నికణం అన్నారు సీఎం వైఎస్ జగన్ రెడ్డి. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి మోదీ రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని దిశా నిర్దేశం చేశారు.
విజయ్ సంకల్ప్ దివస్ సభ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. ప్రత్యేకించి బండి సంజయ్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : వైఫల్యాలు విజయానికి సోపానాలు – పీఎం