Rahul Gandhi : యువతను నిరుద్యోగులుగా మార్చిన మోదీ
తన మిత్రుల కోసం పని చేస్తున్న ప్రధాని
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ప్రచార ఆర్భాటం తప్పా ఈరోజు వరకు దేశం కోసం చేసిన ఒక్క మంచి పని లేదన్నారు.
దేశానికి ఆయువు పట్టుగా భావించే రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే అగ్నిపథ్ స్కీంను తీసుకు వచ్చారంటూ ఆరోపించారు. సోమవారం రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అగ్నిపథ్ స్కీం పేరుతో దేశంలోని యువతను ప్రధాని మోసం చేశారంటూ మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. గత ఎన్నికల్లో లెక్కలేనన్ని హామీలు ఇచ్చారని ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు.
దేశంలో పురోభివృద్ధి సంగతి దేవుడెరుగు తిరోగమనంలోకి తీసుకు వెళుతున్నారని ఆరోపించారు. ఈ రోజు వరకు ప్రజా సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.
కరోనా కాలంలో అసలైన సంఖ్యను దాచి పెట్టారని, ద్రవ్యోల్బణం వెక్కి రిస్తోందని, నిరుద్యోగులు రోడ్ల పాలయ్యారని ఎద్దేవా చేశారు.
ఈ దేశంలో ఎన్నికైన ప్రధాన మంత్రి మోదీ ప్రజల కోసం కాకుండా తన మిత్రులైన వ్యాపారవేత్తల కోసం మాత్రమే ఉన్నారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అగ్నిపథ్ స్కీం ను రద్దు చేసేంత దాకా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని కాకుండా తన రాజ్యాంగాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారంటూ ఆరోపించారు.
ఉద్యోగాల కోసం యువత ఎలా ఇబ్బందులు పడుతున్నారనే దానిపై ఓ వీడియోను కూడా షేర్ చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
Also Read : మాకు స్వయం ప్రతిపత్తి కావాలి – రాజా
अपने 'मित्रों' का भविष्य विदेशों तक में सुरक्षित करने वाले प्रधानमंत्री जी ने अपने देश के युवाओं को बेरोज़गार बनने के लिए छोड़ दिया है।
इन युवाओं के साथ इतना पक्षपात क्यों? pic.twitter.com/4Gnsapgj1e
— Rahul Gandhi (@RahulGandhi) July 4, 2022